తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amma Nanna O Tamila Ammayi: అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయిలో ప‌వ‌న్‌, ర‌వితేజ కంటే ముందు ఫిక్స‌యిన‌ హీరో ఇత‌డే!

Amma Nanna O Tamila Ammayi: అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయిలో ప‌వ‌న్‌, ర‌వితేజ కంటే ముందు ఫిక్స‌యిన‌ హీరో ఇత‌డే!

19 November 2023, 15:10 IST

  • Amma Nanna O Tamila Ammayi: అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమా ర‌వితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అత‌డిని స్టార్ హీరోగా నిల‌బెట్టింది. అయితే ఈ సినిమాలో ఫ‌స్ట్ ఛాయిస్ ర‌వితేజ కాదట‌. మ‌రో హీరోతో ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌ అనౌన్స్‌చేశారు.ఆ హీరో ఎవ‌రంటే?

అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి
అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి

అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి

Amma Nanna O Tamila Ammayi: ర‌వితేజ‌కు స్టార్‌డ‌మ్ తీసుకొచ్చిన సినిమాల్లో అమ్మ‌నాన్న త‌మిళ అమ్మాయి ఒక‌టి. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 2003లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ర‌వితేజ యాక్టింగ్‌, హీరోయిజం అభిమానుల‌ను మెప్పించాయి.

ట్రెండింగ్ వార్తలు

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

Guppedantha Manasu Serial: శైలేంద్ర‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మ‌ను - బిల్డ‌ప్‌లు తుస్ - ఎండీ సీట్‌ను కాపాడుకున్న వ‌సు

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయితోనే స్టార్ హీరోల‌ లీగ్‌లోకి ర‌వితేజ ఎంట‌ర‌య్యాడు. అయితే అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయిలో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ ర‌వితేజ కాదు. త‌మిళ న‌టుడు శ్రీరామ్ ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అఫీషియ‌ల్‌గా అత‌డితో ఈ సినిమాను అనౌన్స్‌చేశార‌ట‌.

కానీ ఫైట్స్‌తో కూడిన మాస్ క్యారెక్ట‌ర్‌కు న్యాయం చేయ‌లేన‌నే ఆలోచ‌న‌లో అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాను శ్రీరామ్ వ‌దులుకున్నాడు. శ్రీరామ్ తిర‌స్క‌రించ‌డంతో అత‌డి స్థానంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తీసుకోవాల‌ని పూరి జ‌గ‌న్నాథ్‌ అనుకున్నాడు.

కానీ ప‌వ‌న్ కూడా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ర‌వితేజ‌ను హీరోగా సెలెక్ట్ చేశారు. అలా శ్రీరామ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేయాల్సిన సినిమా ర‌వితేజ‌ను వ‌రించింది. అత‌డి కెరీర్‌ను మ‌లుపుతిప్పింది. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమా వ‌దులుకున్న విష‌యాన్ని శ్రీరామ్ ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయితో పాటు మ‌ణిర‌త్నం లాంటి దిగ్గ‌ర ద‌ర్శ‌కుల సినిమాల్ని చేయ‌లేక‌పోయాన‌ని, ఆ విష‌యంలో ఎలాంటి బాధ లేద‌ని శ్రీరామ్ తెలిపాడు. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాలో అసిన్ హీరోయిన్‌గా న‌టించ‌గా జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం