తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nora Fatehi On Sukesh: తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే పెద్ద ఇల్లు ఇస్తా అన్నాడు: బాలీవుడ్ నటి నోరా

Nora Fatehi on Sukesh: తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే పెద్ద ఇల్లు ఇస్తా అన్నాడు: బాలీవుడ్ నటి నోరా

Hari Prasad S HT Telugu

19 January 2023, 15:35 IST

    • Nora Fatehi on Sukesh: తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే సుకేశ్ పెద్ద ఇల్లు ఇస్తా అన్నాడని బాలీవుడ్ నటి నోరా ఫతేహి వెల్లడించింది. ఢిల్లీలోని పటియాలా కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఆమె మరోసారి తన స్టేట్మెంట్ ఇచ్చింది.
నోరా ఫతేహి
నోరా ఫతేహి

నోరా ఫతేహి

Nora Fatehi on Sukesh: మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి గురువారం (జనవరి 19) మరోసారి ఢిల్లీలోని పటియాలా కోర్టులో తన స్టేట్మెంట్ రికార్డు చేసింది. మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ తో కలిసి రూ.215 కోట్ల మేర మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు నోరాతోపాటు మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఇదే కేసులో అటు జాక్వెలిన్ కూడా గురువారం మరోసారి కోర్టు ముందు హాజరైంది. ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు తన వెంట పడుతున్నా.. తాను మాత్రం నీ వెంట పడుతున్నట్లు సుకేశ్ తనతో చెప్పినట్లు నోరా తన తాజా స్టేట్మెంట్ తో తెలిపింది. తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే పెద్ద బంగ్లాను గిఫ్ట్ గా ఇస్తానని కూడా అతడు చెప్పినట్లు నోరా వెల్లడించింది.

గతేడాది నుంచి ఈ మనీ లాండరింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నోరాతోపాటు బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిక్కీ తంబోలి, చాహత్ ఖన్నాలాంటి వాళ్లు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా సుకేశ్ తన సన్నిహితురాలు పింకీ ఇరానీ ద్వారా తనకు రాయబారం పంపినట్లు కూడా నోరా ఆరోపించింది.

"మొదట్లో సుకేశ్ ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత అతడు ఎల్ఎస్ కార్పొరేషన్ అనే సంస్థలో పని చేస్తాడని అనుకున్నాను. అతనితో నాకు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడూ కలవలేదు. ఈడీ ఆఫీసులో విచారణ సమయంలో అతన్ని తొలిసారి చూశాను" అని నోరా తన స్టేట్మెంట్ లో స్పష్టం చేసింది.

ఈ దోపిడీ, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఢిల్లీలోని పటియాలా కోర్టులో నోరా తన స్టేట్మెంట్ ఒకసారి రికార్డు చేసింది. ఇప్పుడామె స్టేట్మెంట్ ను ఓ సాక్ష్యంగా కోర్టు పరిగణిస్తున్నట్లు సమాచారం. రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో తనకు ఈడీ నోటీసులు అందిన సమయంలోనే సుకేశ్ ఓ మోసగాడు అన్న విషయం తనకు తెలిసిందని కూడా నోరా చెప్పింది. అయితే సుకేశ్ నుంచి నోరాకు ఖరీదైన బహుమతులు, కార్లు, డైమండ్లు, డిజైనర్ బ్యాగులు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం