తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithin: ఇండస్ట్రీలో ఆయన వల్లే హీరోగా ఉన్నాను.. నితిన్ కామెంట్స్ వైరల్

Nithin: ఇండస్ట్రీలో ఆయన వల్లే హీరోగా ఉన్నాను.. నితిన్ కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu

05 December 2023, 14:30 IST

  • Nithin About Extra Ordinary Man: హీరో నితిన్ త్వరలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 4న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇండస్ట్రీలో ఆయన వల్లే హీరోగా ఉన్నాను.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ కామెంట్స్
ఇండస్ట్రీలో ఆయన వల్లే హీరోగా ఉన్నాను.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఆయన వల్లే హీరోగా ఉన్నాను.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ కామెంట్స్

Extra Ordinary Man Pre Release Event: హీరో నితిన్, డ్యాన్సింగ్ క్వీన్, క్రేజీ బ్యూటి శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాను రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

నితిన్ కొత్త సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 4) గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నితిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా నాకు చాలా స్పెషల్. ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది" అని నితిన్ అన్నాడు.

"రాజశేఖర్ గారు చేసిన మగాడు సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టే మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. ఇలా మళ్లీ మీరు నా సినిమాలో ఇలా స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. హ్యారిస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది. మా డీఓపీ యువరాజ్‌తో మూడు సినిమాలు చేశాను. నన్ను ఎలా చూపించాలో ఆయనకు తెలుసు" అని నితిన్ చెప్పుకొచ్చాడు.

"శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు అవసరమైనప్పుడు డేట్స్ ఇచ్చారు. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ కానీ.. రియల్ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమాను చూసి నా ఫ్యాన్స్, ప్రేక్షకులు అంంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాం" అని నితిన్ ధీమా వ్యక్తం చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం