తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin - Venu Sriram Movie: వ‌కీల్‌సాబ్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన నితిన్‌

Nithiin - Venu Sriram Movie: వ‌కీల్‌సాబ్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన నితిన్‌

04 March 2023, 7:34 IST

  • Nithiin - Venu Sriram Movie: వ‌కీల్‌సాబ్ ద‌ర్శ‌కుడు వేణుశ్రీరామ్‌తో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉందంటే...

నితిన్
నితిన్

నితిన్

Nithiin - Venu Sriram Movie: వ‌కీల్‌సాబ్(Vakeel Saab) ద‌ర్శ‌కుడు వేణుశ్రీరామ్‌కు (Venu Sriram) ఎట్ట‌కేల‌కు హీరో దొరికాడు. వేణుశ్రీరామ్ త‌న త‌దుప‌రి సినిమాను హీరో నితిన్‌తో (Nithiin) చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా 2021లో రూపొందిన వ‌కీల్‌సాబ్ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు వేణుశ్రీరామ్‌. ఈ సినిమా రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోన్న ఇప్ప‌టివ‌ర‌కు వేణు శ్రీరామ్ త‌దుప‌రి సినిమాపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్‌తో ఐకాన్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

కానీఅనౌన్స్‌మెంట్‌తోనే ఐకాన్‌కు ఎండ్‌కార్డ్ ప‌డింది. ధ‌నుష్, రామ్‌తో వేణుశ్రీరామ్ సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా అవి కార్య‌రూపం దాల్చ‌లేదు. తాజాగా వేణుశ్రీరామ్‌కు నితిన్ ఛాన్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఎమ్‌సీఏ త‌ర‌హాలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నితిన్‌, వేణుశ్రీరామ్‌ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

రొమాన్స్‌తో పాటు కామెడీ, యాక్ష‌న్ అంశాల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తూ వేణుశ్రీరామ్ సిద్ధం చేసిన క‌థ న‌చ్చ‌డంతో నితిన్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. వేణు శ్రీరామ్ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన‌ మూడు సినిమాల్ని దిల్‌రాజు నిర్మించారు. నితిన్ ప్రాజెక్ట్ కూడా ఇదే బ్యాన‌ర్‌లో రూపొంద‌బోతున్న‌ట్లు తెలిసింది.

శ్రీనివాస క‌ళ్యాణం త‌ర్వాత దిల్‌రాజు బ్యాన‌ర్‌లో నితిన్ చేయ‌నున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఉగాది రోజున ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్నాడు నితిన్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం