తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Password Sharing: నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేయడం ఆ దేశంలో నేరం

Netflix Password sharing: నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేయడం ఆ దేశంలో నేరం

HT Telugu Desk HT Telugu

22 December 2022, 17:03 IST

    • Netflix Password sharing: నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేయడం ఆ దేశంలో ఇక నేరం కానుంది. మీరు విన్నది నిజమే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోవద్దన్న రూల్‌ ఉన్న విషయం మీకు తెలుసా?
పాస్‌వర్డ్‌ షేరింగ్ ను సీరియస్ గా తీసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌
పాస్‌వర్డ్‌ షేరింగ్ ను సీరియస్ గా తీసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌

పాస్‌వర్డ్‌ షేరింగ్ ను సీరియస్ గా తీసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌

Netflix Password sharing: అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌. మిగతా ఓటీటీలతో పోలిస్తే ఈ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ చాలా ఖరీదైనది. దీంతో ఇండియాలాంటి దేశాల్లో చాలా మంది ఈ ఓటీటీకి దూరంగా ఉన్నారు. అయితే తమకు తెలిసిన బంధువులు, స్నేహితులు ఎవరైనా నెట్‌ఫ్లిక్స్‌ మల్టిపుల్‌ స్క్రీన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే వాళ్ల నుంచి పాస్‌వర్డ్‌ తీసుకొని లాగిన్‌ అవుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 20th Episode: బయటపడిన మనోహరి బాగోతం.. అందరిలో మొదలైన అనుమానం.. భాగీని వదిలి బయల్దేరిన అమర్​​​​!

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

కానీ ఇలా చేయకూడదు అన్న నిబంధన ఉంది. ఇన్నాళ్లూ కేవలం ఓ నిబంధనగానే ఉన్నా.. ఇక నుంచి పాస్‌వర్డ్‌ పంచుకోవడం ఓ నేరం అని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ స్పష్టం చేస్తోంది. ఆ దేశంలోని ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆఫీస్‌ మాత్రం ఇక నుంచి అలా పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకుంటే నేర అభియోగాలు తప్పవని హెచ్చరించింది. దీనిని సెకండరీ కాపీరైట్‌ ఉల్లంఘనగా పరిగణించనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ కూడా వచ్చే ఏడాది నుంచి ఇలా పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు అదనంగా వసూలు చేయనున్నట్లు అనౌన్స్‌ చేసింది. కానీ యూకే మాత్రం మరో అడుగు ముందుకేసి దీనినో నేరంగా పరిగణించాలని నిర్ణయించడం గమనార్హం. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్‌ ఈ మధ్య రిలీజ్‌ చేసిన కొత్త మార్గదర్శకాల్లో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను ఓ నేరంగా పరిగణించింది.

అయితే తర్వాత ఆ లిస్ట్‌ నుంచి పాస్ట్‌వర్డ్‌ షేరింగ్‌ పదాన్ని తొలగించింది. చట్టంలో ఎలాంటి మార్పు లేదని ఆ తర్వాత ఐపీవో అధికార ప్రతినిధి వెల్లడించారు. కానీ అలాంటి వ్యక్తులపై కోర్టుల ద్వారా చర్యలు తీసుకునే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌కే వదిలేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది ఇతరులు షేర్‌ చేసిన పాస్‌వర్డ్‌ల ద్వారా వినియోగిస్తున్నారని, ఇది తమ ఆదాయంపై ప్రభావం చూపుతోందని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు డబ్బులు చెల్లించి వినియోగిస్తున్న వారి సంఖ్య 22.2 కోట్లుగా ఉంది. వీళ్లు మరో 10 కోట్ల మంది తమ పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసినట్లు గుర్తించారు. ఇలాంటి యూజర్లను తగ్గించడానికి అకౌంట్‌ వెరిఫికేషన్‌ టూల్‌ను కూడా గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ ప్రయోగాత్మకంగా ఉపయోగించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం