తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nbk107 | సింహం వేటకు సిద్ధం.. బర్త్‌డేన బాలయ్యకు స్పెషల్ గిఫ్ట్

NBK107 | సింహం వేటకు సిద్ధం.. బర్త్‌డేన బాలయ్యకు స్పెషల్ గిఫ్ట్

07 June 2022, 10:22 IST

    • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్10న విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బాలకృష్ణ కొత్త సినిమా
బాలకృష్ణ కొత్త సినిమా (Twitter)

బాలకృష్ణ కొత్త సినిమా

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NB107 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ వారంలోనే బాలయ్య పుట్టిన రోజు రాబోతున్న తరుణంలో.. చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని పోస్టర్‌ రూపంలో విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

"సింహం వేటకి సిద్ధం" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విషయాన్ని తెలియజేసింది. బాలకృష్ణ రెండు చేతులు వెనక్కి పెట్టుకున్న ఫొటోను విడుదల చేసింది. బాలయ్య ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో కథానాయికగా చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనలతో ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ నటిస్తోన్న 107వ చిత్రం. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని వహిస్తున్నారు.

ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్ చేస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం