తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Marraige Pics : నయనతార, విఘ్నేష్ పెళ్లి ఫొటో వచ్చేసిందిగా..

Nayanthara Marraige Pics : నయనతార, విఘ్నేష్ పెళ్లి ఫొటో వచ్చేసిందిగా..

HT Telugu Desk HT Telugu

09 June 2022, 15:21 IST

    • సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సంబంధించిన మెుదటి ఫొటోను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు.
నయనతార-విఘ్నేష్ పెళ్లి ఫొటో
నయనతార-విఘ్నేష్ పెళ్లి ఫొటో (twitter)

నయనతార-విఘ్నేష్ పెళ్లి ఫొటో

లేడి సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహమైంది. కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తాజాగా ఏడు అడుగులు వేసి.. ఒకటయ్యారు. పెళ్లికి సంబంధించిన మెుదటి ఫొటోను విఘ్నేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఈ చిత్రంలో నయనతార అద్భుతంగా కనిపిస్తుండగా, విఘ్నేష్ ఆమెకు ముద్దు ఇచ్చాడు. ఆమె నయన్ & ఐయామ్ ది వన్.. భగవంతుని దయతో మా తల్లిదండ్రులు, స్నేహితుల ఆశీర్వాదాలతో నయనతారను వివాహం చేసుకున్నాను అని ట్వీట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

సన్నిహితులు కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో నయనతార, విఘ్నేష్ పెళ్లి వేడుక జరిగింది. వీరి పెళ్లికి పలువురు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఉద‌యం ఎనిమిది గంట‌ల ప‌దినిమిషాల నుంచి వీరి వివాహ తంతు మొద‌లైంది. హిందూ, క్రిస్టియ‌న్ రెండు సంప్రదాయ పద్ధతుల్లో వివాహం జ‌రిగిన‌ట్లుగా వార్తలు వస్తున్నాయి. న‌య‌న‌తార‌, విఘ్నేష్‌శివ‌న్ పెళ్లి వేడుక‌లో కోలీవుడ్ సినీ ప్రముఖులు క‌నిపించారు.

న‌య‌న్‌, విఘ్నేష్ పెళ్లికి బాలీవుడ్ అగ్ర న‌టుడు షారుఖ్‌ఖాన్ స్పెష‌ల్ అట్రాక్షన్ గా నిలిచారు. దర్శకుడు అట్లీ తో క‌లిసి షారుఖ్‌ఖాన్ పెళ్లి కి హాజ‌ర‌య్యారు. అట్లీ ఫ్యామిలీతో షారుఖ్‌ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం జ‌వాన్‌కు అట్లీ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే కోలీవుడ్ అగ్ర హీరో ర‌జ‌నీకాంత్ కూడా న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ పెళ్లికి హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కార్తి, విజ‌య్ సేతుప‌తి, ఎస్ జే సూర్య, మ‌ణిర‌త్నం, కె.ఎస్‌.ర‌వికుమార్‌, ఉధ‌య‌నిధి స్టాలిన్ తో పాటు ప‌లువురు ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం