తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapoorni Twitter Review: అన్న‌పూర్ణి ట్విట్ట‌ర్ రివ్యూ - న‌య‌న‌తార లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఇదే

Annapoorni Twitter Review: అన్న‌పూర్ణి ట్విట్ట‌ర్ రివ్యూ - న‌య‌న‌తార లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఇదే

01 December 2023, 6:22 IST

  • Annapoorni Twitter Review: న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన అన్న‌పూర్ణి మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, జై కీల‌క పాత్ర‌లు పోషించారు.

న‌య‌న‌తార
న‌య‌న‌తార

న‌య‌న‌తార

Annapoorni Twitter Review: నయనతార హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ‌ లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్న‌పూర్ణి శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 1న‌) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాహుబ‌లి స‌త్య‌రాజ్‌, జై ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జ‌వాన్ త‌ర్వాత న‌య‌న‌తార న‌టించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు

Nani: నాని సినిమాపై సందిగ్ధత.. ఆ ప్రాజెక్ట్ ఉంటుందా?

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

చెఫ్ కావాల‌ని క‌ల‌లు క‌నే ఓ యువ‌తి ప్ర‌యాణాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ద‌ర్శ‌కుడు నీలేష్ కృష్ణ‌ ఈ సినిమాలో చూపించాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయ‌లకు, త‌న క‌ల‌ల‌కు మ‌ధ్య ఓ యువ‌తి ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను చూపించిన సీన్స్‌లో డ్రామా చ‌క్క‌గా పండింద‌ని చెబుతున్నారు. సినిమా క‌థ చాలా వ‌ర‌కు ఫుడ్ చుట్టే తిరుగుతుంద‌ని, కానీ వాటిలో వ‌చ్చే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని పేర్కొంటున్నారు. క‌థ‌లోనే అంత‌ర్లీనంగా ద‌ర్శ‌కుడు ఫ‌న్ జ‌న‌రేట్ చేసిన తీరు బాగుంద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ మూవీ ఇద‌ని అంటున్నారు.

త‌మ‌న్ బీజీఎమ్‌

ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌య‌న‌తార యాక్టింగ్ అద్భుత‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. నీలేష్ ఖ‌న్నాకు ఫ‌స్ట్ మూవీ అయినా మంచి మెసేజ్‌తో ఈ మూవీని తెర‌కెక్కించాడ‌ని చెబుతున్నారు. ఫీల్‌గుడ్ మూవీగా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. త‌మ‌న్ బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నెటిజ‌న్లు రివ్యూలు ఇచ్చేస్తున్నారు. న‌య‌న‌తార త‌ర్వాత ఈ సినిమాలో స‌త్య‌రాజ్ పాత్ర ఇంప్రెసివ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం