తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Annapoorani Trailer: నయనతార అన్నపూర్ణి ట్రైలర్ వచ్చేసింది.. చెఫ్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

Nayanthara Annapoorani Trailer: నయనతార అన్నపూర్ణి ట్రైలర్ వచ్చేసింది.. చెఫ్ పాత్రలో లేడీ సూపర్ స్టార్

Hari Prasad S HT Telugu

27 November 2023, 21:44 IST

    • Nayanthara Annapoorani Trailer: నయనతార నటించిన 75వ సినిమా అన్నపూర్ణి ట్రైలర్ వచ్చేసింది. చెఫ్ పాత్రలో లేడీ సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (డిసెంబర్ 1)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అన్నపూర్ణి మూవీలో నయనతార
అన్నపూర్ణి మూవీలో నయనతార

అన్నపూర్ణి మూవీలో నయనతార

Nayanthara Annapoorani Trailer: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ట్రైలర్ సోమవారం (నవంబర్ 27) రిలీజైంది. ఇండియాలో బెస్ట్ చెఫ్‌గా మారాలని కలలు కనే అమ్మాయి పాత్రలో నయన్ కనిపించింది. ఈ ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. నీలేశ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ తమిళ సినిమా శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Aquaman and the Lost Kingdom OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఫ్రీగా చూసేయండి

నయనతారకు కెరీర్లో ఇది 75వ సినిమా కావడం విశేషం. ఈ మధ్యే షారుక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో నటించిన నయన్.. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ అన్నపూర్ణిలో కనిపించబోతోంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె.. ప్రొఫెషనల్ చెఫ్ గా మారాలని అనుకున్నా.. నాన్ వెజ్ కూడా వండాల్సి రావడంతో కుటుంబం నుంచి ఒత్తిడి ఎదుర్కొంటుంది.

ఈ సవాలును ఆమె ఎలా ఎదుర్కొని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎదుగుతుందన్నదే ఈ అన్నపూర్ణి మూవీ స్టోరీ. ఇండియాస్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్ లో పాల్గొన్న సమయంలో జరిగే అనుకోని ఘటన.. ఆమె చేస్తున్న పనిని కుటుంబానికి తెలిసేలా చేస్తుంది. తర్వాత వాళ్ల నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. ఈ ట్రైలర్ లో నయన్ లవ్ స్టోరీ కూడా ఉండటం విశేషం.

నయనతార 75వ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. నయనతారతోపాటు జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం