తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malli Pelli Ott Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మ‌ళ్ళీ పెళ్లి - స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Malli Pelli OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న మ‌ళ్ళీ పెళ్లి - స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

HT Telugu Desk HT Telugu

13 June 2023, 14:06 IST

  • Malli Pelli OTT Release Date: న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ జంట‌గా న‌టించిన మ‌ళ్ళీ పెళ్లి మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది.ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు రిలీజ్ కానుందంటే...

మ‌ళ్ళీ పెళ్లి మూవీ
మ‌ళ్ళీ పెళ్లి మూవీ

మ‌ళ్ళీ పెళ్లి మూవీ

Malli Pelli OTT Release Date: న‌రేష్, ప‌విత్రా లోకేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ళ్ళీ పెళ్లి మూవీ ఈ నెల‌లోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకొంది. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్‌లో మ‌ళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు క‌న్న‌డ వెర్ష‌న్స్ ఒకే రోజు ఓటీటీలో విడుద‌ల‌కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

న‌రేష్, ప‌విత్రా లోకేష్ జంట‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు కోట్ల‌కు మ‌ళ్ళీ పెళ్లి ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ ద‌క్కించుకొన్న‌ట్లు స‌మాచారం. గ‌త కొంత‌కాలంగా న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ద‌ర్శ‌కుడు ఎం.ఎస్ రాజు ఈ మూవీని తెర‌కెక్కించారు.

టీజ‌ర్స్‌, ట్రైల‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో మ‌ళ్ళీ పెళ్లి ఆస‌క్తిని రేకెత్తించింది. కానీ ఎగ్జైట్‌మెంట్‌ను థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంతో విఫ‌లం కావ‌డంతో మ‌ళ్ళీ పెళ్లి డిజాస్ట‌ర్‌గా మిగిలింది. తెలిసిన క‌థ కావ‌డంతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

మ‌ళ్ళీ పెళ్లి క‌థ‌మిటంటే...

ప్ర‌ముఖ సినీ న‌టుడు న‌రేంద‌ర్ (న‌రేష్‌) వైవాహిక జీవితం గొడ‌వ‌ల‌తో నిండిపోయిఉంటుంది. విభేదాల కార‌ణంగా సౌమ్య సేతుప‌తికి దూరంగా ఉంటాడు. అత‌డి జీవితంలో మ‌రో న‌టి పార్వ‌తి ఎలా వ‌చ్చింది?

వారి ప్రేమ బంధానికి సొసైటీతో పాటు సౌమ్య సేతుప‌తి నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాన్న‌దే మ‌ళ్ళీ పెళ్లి మూవీ క‌థ‌. ఈ సినిమాలో శ‌ర‌త్‌బాబు, వ‌నిత విజ‌య్‌కుమార్‌, జ‌య‌సుధ‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్ని పోషించారు. ఈ సినిమాను విజ‌య‌కృష్ణ ఫిలింస్ బ్యాన‌ర్‌పై న‌రేష్ స్వ‌యంగా ఈ మూవీని నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం