తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Movie With Balagam Venu: బలగం డైరెక్టర్ వేణుతో హీరో నాని సినిమా.. ఎలాంటి జోనర్ అంటే?

Nani Movie With Balagam Venu: బలగం డైరెక్టర్ వేణుతో హీరో నాని సినిమా.. ఎలాంటి జోనర్ అంటే?

Sanjiv Kumar HT Telugu

05 December 2023, 12:49 IST

  • Nani About Balagam Venu: నేచురల్ స్టార్ నాని మరో రెండు రోజుల్లో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బలగం వేణుతో సినిమాపై ఆసక్తికర సమాధానం ఇచ్చాడు నాని. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బలగం డైరెక్టర్ వేణుతో హీరో నాని సినిమా.. ఎలాంటి జోనర్ అంటే?
బలగం డైరెక్టర్ వేణుతో హీరో నాని సినిమా.. ఎలాంటి జోనర్ అంటే?

బలగం డైరెక్టర్ వేణుతో హీరో నాని సినిమా.. ఎలాంటి జోనర్ అంటే?

Hi Nanna Movie: అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన నాని (Nani) నేచురల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూనే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. దసరాలో రా అండ్ రస్టిక్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన నాని ఆ మూవీతో శ్రీకాంత్ ఓదెలను (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

ఇప్పుడు మంచి ఫీల్ గుడ్ హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్‌ను (Shouryuv) డెబ్యూ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు నాని. సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నాడు నాని.

హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్‌లలో భాగంగా తాజాగా ట్విటర్ వేదిగా "ఆస్క్ నాని" (#AskNani) అనే సెషన్ నిర్వహించాడు నాని. ఇందులో సినీ అభిమానులు, ఫ్యాన్స్, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు నాని. గంటపాటు సాగిన ఈ సెషన్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు నాని.

"హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అయితే, కొత్త డైరెక్టర్లలో మీరు ఎవరితో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు" అని అడిగిన ప్రశ్నకు "బలగం డైరెక్టర్ వేణు" అని నాని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో గింగిరాలు తిరుగుతుంది. రానున్న రోజుల్లో నానికి కథ ఓకే అయితే వేణు, నాని కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని నెటిజన్స్ ఆశిస్తున్నారు.

కాగా జబర్దస్త్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి (Venu Yeldandi) బలగం (Balagam Movie) మూవీతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, బంధాలను హార్ట్ టచింగ్‌గా చూపించి తెలుగు రాష్ట్రాలు ఆ మూవీ గురించే మాట్లాడుకునేలా చేశాడు.

అలాంటి వేణు ఎమోషనల్ సీన్స్‌ను పిండేయగల నానితో మూవీ చేస్తే వావ్.. వావ్.. అనిపిస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ నానితో సినిమా తెరకెక్కిస్తే అది ఎలాంటి జోనర్‌లో ఉంటుందో చూడాలని ప్రేక్షకులు, నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూడటం ఖాయం. ఇటీవల తన రెండో మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపిన వేణు.. నాని ట్వీట్‌కు రియాక్ట్ అవుతాడో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం