తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Into Politics: రాజకీయాల్లోకి నేచురల్ స్టార్ నాని.. తనకే ఓటు వేయమంటూ రిక్వెస్ట్

Nani Into Politics: రాజకీయాల్లోకి నేచురల్ స్టార్ నాని.. తనకే ఓటు వేయమంటూ రిక్వెస్ట్

Sanjiv Kumar HT Telugu

18 November 2023, 11:42 IST

  • Nani Into Politics And Request To Vote: నేచురల్ స్టార్ నాని సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా తనకు ఓటు వేయమంటి ప్రజలకు మనవి చేసుకుంటున్నాడు. పొలిటిషియన్ డ్రెస్సులో కనిపించి ప్రచారం చేస్తున్నాడు.

రాజకీయాల్లోకి నేచురల్ స్టార్ నాని.. తనకే ఓటు వేయమంటూ రిక్వెస్ట్
రాజకీయాల్లోకి నేచురల్ స్టార్ నాని.. తనకే ఓటు వేయమంటూ రిక్వెస్ట్ (Twitter)

రాజకీయాల్లోకి నేచురల్ స్టార్ నాని.. తనకే ఓటు వేయమంటూ రిక్వెస్ట్

Nani Latest Tweet Viral: ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. రాజకీయ పార్టీలు తమకంటే తమకే ఓటు వేయాలని, ప్రత్యర్థులను తిడుతూ, తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ హామీలు ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి నేచురల్ స్టార్ నాని చేరారు. రాజకీయ నాయకుడిగా కనిపించి తనకే ఓటు వేయమని ప్రచారం చేస్తున్నాడు నాని.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

తాజాగా సోషల్ మీడియా వేదికగా నాని షేర్ చేసిన పోస్ట్ తెగ ట్రెండ్ అవుతోంది. అందులో రాజకీయ నాయుకుడిగా చేతులతో దండం పెడుతున్న నాని ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీంతో నాని రాజకీయాల్లోకి చేరుతున్నాడా అనే అనుమానం వస్తోంది. కానీ, నాని రాజకీయాల్లోకి, ఏ పార్టీలోకి చేరట్లేదు. ఇదంతా తన కొత్త సినిమా హాయ్ నాన్న కోసం చేసిన నాని పబ్లిక్ స్టంట్.

"ఇప్పుడు అంతా ఎలక్షన్ మూడ్ నడుస్తోంది. కాస్తా పిచ్చిగా ఎందుకు చేయకూడదు. డిసెంబర్ 7న మీ ప్రేమ, ఓటు మాకే అవ్వాలని మీ హాయ్ నాన్న పార్టీ అధ్యక్షుడు విరాజ్" అని రాసుకొచ్చాడు హీరో నాని. అంతేకాకుండా "కొన్ని ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం" అని ఆ పోస్టులో చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని హీరోగా చేస్తున్న సినిమా హాయ్ నాన్న. ఇందులో నానికి జోడీగా సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం