తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లోకి సోలోగా రానున్న దసరా - నానికి నో కాంపిటీషన్

Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లోకి సోలోగా రానున్న దసరా - నానికి నో కాంపిటీషన్

28 March 2023, 5:44 IST

  • Movies In Theaters This Week:: ఈ వారం తెలుగులో నాని ద‌స‌రా సినిమా సోలోగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ద‌స‌రాతో పాటు ఈ వారం త‌మిళం, హిందీ భాష‌ల్లో కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే

నాని కీర్తిసురేష్
నాని కీర్తిసురేష్

నాని కీర్తిసురేష్

Telugu Movies Releasing This Week: ఈ వారం సోలోగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు హీరో నాని సిద్ధ‌మ‌వుతోన్నాడు. థియేట‌ర్ల‌లోకి ద‌స‌రా మిన‌హా ఈ వారం తెలుగు సినిమాలేవి రిలీజ్ కావ‌డం లేదు. బాలీవుడ్‌తో పాటు త‌మిళంలో పోటీ ఉన్నా తెలుగులో మాత్రం నానికి కాంపిటీష‌న్ లేదు. మార్చి 30న రిలీజ్ కానున్న‌ ద‌స‌రా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్య‌లో థియేట‌ర్లు దొరికాయి.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

నాని కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న సినిమాగా ద‌స‌రా నిల‌వ‌నుంది. ఈ సినిమాపై నెల‌కొన్న హైప్ దృష్ట్యా ఓపెనింగ్స్ గ‌ట్టిగానే వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈసినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు.

తెలంగాణ నేప‌థ్య క‌థాంశంతో కెరీర్‌లో తొలిసారి నాని న‌టిస్తోన్న ఈ సినిమా ఇది. ఈ సినిమా కోసం నాని, కీర్తిసురేష్ ఇద్ద‌రు తెలంగాణ యాస నేర్చుకొని సొంతంగా డ‌బ్బింగ్ చెప్పారు. ద‌స‌రా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. అయితే ద‌స‌రాకు పోటీగా అదే రోజు త‌మిళం, హిందీ భాష‌ల్లో మాత్రం సినిమాలు విడుద‌ల‌కాబోతున్నాయి.

త‌మిళంలో రెండు సినిమాలు

శింబు, గౌత‌మ్ కార్తిక్ హీరోలుగా న‌టించిన త‌మిళ సినిమా పాతుత‌లా మార్చి 30న విడుద‌ల‌కాబోతున్న‌ది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన మ‌ఫ్టీ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఎన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

పాతుత‌లాతో పాటుగా వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న త‌మిళ సినిమా విడుద‌లై మార్చి 31న రిలీజ్ కానుంది. విజ‌య్ సేతుప‌తి, సూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమా డ‌బ్బింగ్ ద్వారా అదే రోజు తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

హిందీలో భోలా...

అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భోళా సినిమా మార్చి 30న ప్రేక్ష‌క‌లు ముందుకొస్తోంది. త‌మిళ చిత్రం ఖైదీ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఈ వారం కొత్త సినిమాల‌తో పాటు నితిన్ హీరోగా న‌టించిన క్లాసిక్ ల‌వ్‌స్టోరీ ఇష్క్‌ మార్చి 29న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాను మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం