తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya: ఆ సినిమా హిట్ అయితేనే హిందీలో న‌టిస్తా - బాలీవుడ్ కెరీర్‌పై నాగ‌చైత‌న్య కామెంట్స్‌

Naga Chaitanya: ఆ సినిమా హిట్ అయితేనే హిందీలో న‌టిస్తా - బాలీవుడ్ కెరీర్‌పై నాగ‌చైత‌న్య కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

24 July 2022, 13:25 IST

  • ఆమిర్‌ఖాన్ (aamir khan) హీరోగా న‌టిస్తున్న లాల్‌సింగ్‌చ‌డ్డాతో నాగ‌చైత‌న్య (naga chaitanya) బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నారు. ఆగ‌స్ట్ 11న ఈ సినిమా రిలీజ్‌కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బాలీవుడ్ కెరీర్‌ఫై నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

నాగచైతన్య, ఆమిర్ ఖాన్
నాగచైతన్య, ఆమిర్ ఖాన్ (twitter)

నాగచైతన్య, ఆమిర్ ఖాన్

పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌తో ఇండ‌స్ట్రీల మ‌ధ్య భాషాప‌ర‌మైన భేదాలు తొల‌గిపోయాయి. ద‌క్షిణాది హీరోలు బాలీవుడ్‌లో...బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమాల్లోనూ న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఆమిర్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్న లాల్‌సింగ్‌చ‌డ్డా సినిమాతో టాలీవుడ్ యువ‌హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

ఇందులో ఆమిర్‌ఖాన్ స్నేహితుడిగా సైనికుడి పాత్ర‌లో నాగ‌చైత‌న్య క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో దాదాపు న‌ల‌భై నిమిషాల పాటు నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ఆగ‌స్ట్ 11న బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో లాల్ సింగ్ చడ్డా (lalsingh chaddha) రిలీజ్‌కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాగ‌చైత‌న్య త‌న బాలీవుడ్ కెరీర్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్‌ఖాన్‌తో సినిమా చేయాల‌నే త‌న క‌ల లాల్ సింగ్ చ‌డ్డాతో నిజ‌మైంద‌ని అన్నాడు.

ఈ సినిమా సెట్స్‌లో ఆయ‌న‌తో గ‌డిపిన ప్ర‌తిక్ష‌ణాన్ని ఎంజాయ్ చేశాన‌ని, న‌టుడిగా ఆయ‌న నుండి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపాడు. అలాగే స‌హ‌న‌టుల‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తార‌ని, ఫ‌లానా రీతిలో మాత్ర‌మే న‌టించాలంటూ డిమాండ్స్ చేయ‌ర‌ని పేర్కొన్నాడు. బాలీవుడ్ లో త‌న తొలి సినిమా ఇదే కావ‌డంతో లాల్ సింగ్ చడ్డా ఫ‌లితం కోసం తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నాడు.

ఈ సినిమా రిజ‌ల్ట్‌ను అనుస‌రించే భ‌విష్య‌త్తులో బాలీవుడ్‌లో సినిమాలు చేయాలా వ‌ద్దా అన్న‌ది నిర్ణ‌యించుకుంటాన‌ని చెప్పాడు. ఒక‌వేళ నేను ఊహించిన రిజ‌ల్ట్ రాక‌పోతే హిందీలో మ‌ళ్లీ న‌టించ‌క‌పోవ‌చ్చున‌ని తెలిపాడు. నాగ‌చైత‌న్య కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌స్తుతం తెలుగులో నాగ‌చైత‌న్య ప‌ర‌శురామ్, వెంక‌ట్‌ప్ర‌భుల‌తో సినిమాలు చేస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం