తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhootha 2: ఆరోజున క్లూస్ ఇస్తా: నాగచైతన్య.. దేని గురించి అంటే!

Dhootha 2: ఆరోజున క్లూస్ ఇస్తా: నాగచైతన్య.. దేని గురించి అంటే!

17 March 2024, 17:41 IST

    • Naga Chaitanya - Dhootha 2: నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియోను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది. మార్చి 19వ తేదీన క్లూ వస్తుందని అందులో చైతూ అన్నారు. రెడీయా అని ప్రేక్షకులకు చెప్పారు.
Naga Chaitanya: ఆరోజున క్లూస్ ఇస్తా: నాగచైతన్య.. దేని గురించి అంటే!
Naga Chaitanya: ఆరోజున క్లూస్ ఇస్తా: నాగచైతన్య.. దేని గురించి అంటే!

Naga Chaitanya: ఆరోజున క్లూస్ ఇస్తా: నాగచైతన్య.. దేని గురించి అంటే!

Naga Chaitanya: యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్య్సకారుడి పాత్రను చైతూ పోషిస్తున్నారు. సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. కాగా, నాగచైతన్య ప్రధాన పాత్రలో గతేడాది దూత వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నారని సమాచారం వచ్చింది. ఇప్పుడు, ధూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్యతో ఓ వీడియోను నేడు (మార్చి 17) రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో.

క్లూస్ కావాలా?

నాగచైతన్య న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఆ పేపర్‌పై పెద్దగా మార్చి 19 అని రాసి ఉంది. “కన్‍ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మార్చి 19న.. మీరు రెడీనా?” అని నాగచైతన్య అన్నారు.

దూత సీజన్ 2 గురించే!

దూత వెబ్ సిరీస్‍లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. కథను ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్‌తో నాగ చైతన్య కనిపించడంతో ఇది దూత సీజన్ 2 అనౌన్స్‌మెంట్ గురించే అని తెలిసిపోతోంది. మార్చి 19న ఈ రెండో సీజన్‍కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించడం ఖాయమనిపిస్తోంది.

గతేడాది డిసెంబర్ 1న స్ట్రీమింగ్‍కు వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్‍కు భారీ వ్యూస్ దక్కాయి. కొన్ని వారాల పాటు గ్లోబల్‍గానూ ట్రెండింగ్‍లో నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీజన్ చాలా సక్సెస్ అయింది.

భవిష్యత్తులో జరిగే ఘటనల గురించిన కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య)కి దొరకడం.. అలానే జరగడం చుట్టూ దూత సీజన్ 1 రూపొందింది. ఉత్కంఠభరితంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సీజన్‍ను తెరకెక్కించారు. మిస్టరీతో పాటు హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. సీజన్ 1 విపరీతంగా ఆకట్టుకోవడంతో దూత సీజన్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.

దూత సీజన్ 1 వెబ్ సిరీస్‍లో పశుపతి, పార్వతి తిరువోతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్, రాజా గౌతమ్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు ఇషాన్ చబ్రా సంగీతం అందించారు.

ఇక, నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్‍ను దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. పాకిస్థాన్ చెరలో కొన్ని నెలల పాటు హింస అనుభవించి భారత్‍కు తిరిగే వచ్చిన మత్య్యకారుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం