తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: తెలుగులో ఆ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హవా.. దేవి డౌన్!

Tollywood: తెలుగులో ఆ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హవా.. దేవి డౌన్!

30 July 2023, 16:00 IST

    • Tollywood: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ చేతిలో ప్రస్తుతం ఐదు తెలుగు చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్‍లో అతడు మళ్లీ బిజీ అయ్యాడు. ఆ వివరాలివే..
జీవీ ప్రకాశ్ కుమార్
జీవీ ప్రకాశ్ కుమార్

జీవీ ప్రకాశ్ కుమార్

Tollywood: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ హవా క్రమంగా తగ్గుతోంది. టాలీవుడ్‍లో దేవీ జోరు బాగా డౌన్ అయింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవీ పరిమితమయ్యాడు. ఇక ప్రస్తుతం పుష్ప- ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు మాత్రమే దేవీ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళంలో కంగువకు సంగీత దర్శకుడిగా ఉన్నాడు. 15ఏళ్లకు పైగా టాలీవుడ్‍లో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన దేవీ శ్రీప్రసాద్‍కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇదే సమయంలో తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హవా టాలీవుడ్‍లో మళ్లీ ఊపందుకుంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

గతంలో తెలుగులోనూ జీవీ ప్రకాశ్ కొన్ని చిత్రాలకు సంగీతం అందించాడు. సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అయితే, కొన్నేళ్లుగా టాలీవుడ్‍లో ఎక్కువగా చిత్రాలు చేయడం లేదు. అయితే, ఇప్పుడు తెలుగులోనూ జీవీ ప్రకాశ్ జోరు పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్‍లో ఏకంగా అతడి చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’కు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి జీవీ స్వరాలు సమకూరుస్తున్నాడు.

యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల సినిమాకు కూడా జీవీ ప్రకాశ్‍ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకుంది ఆ చిత్ర యూనిట్. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రానికి కూడా జీవీ ప్రకాశ్‍ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ చేయనున్న తెలుగు సినిమా ‘లక్కీ భాస్కర్’కు కూడా జీవీ స్వరాలు సమకూర్చనున్నాడు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’కు జీవీ ప్రకాశే సంగీత దర్శకుడిగా ఉన్నాడు. మొత్తంగా టాలీవుడ్‍లో ఐదు సినిమాలతో తెలుగులో మళ్లీ బిజీ అయ్యాడు జీవీ ప్రకాశ్ కుమార్. తమిళంలోనూ అతడి హవా కొనసాగుతుండగా.. నటుడిగానూ కొన్ని చిత్రాలు చేస్తున్నాడు.

మరోవైపు, మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ కూడా తెలుగులోకి మంచి ఎంట్రీ తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషి చిత్రానికి సంగీతం అందించాడు. ఖుషి నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. నాని హీరోగా చేస్తున్న ‘హాయ్ నాన్న’కు కూడా హేషమ్ స్వరాలు అందిస్తున్నాడు. అలాగే, శర్వానంద్ 35వ చిత్రానికి కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం