తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Threat Letter: సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత

Threat letter: సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత

HT Telugu Desk HT Telugu

06 June 2022, 16:27 IST

    • సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ రావడంతో ఆయన ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (AFP)

సల్మాన్ ఖాన్

ముంబై, జూన్ 6: సుప్రసిద్ధ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్‌లను చంపుతామని బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసు బృందం ఒకటి నటుడి బాంద్రా నివాసానికి వెళ్లి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఆదివారం ఉదయం సలీం ఖాన్ మార్నింగ్ వాక్‌కు వెళ్లి బాంద్రా బాండ్‌స్టాండ్ వద్ద ఓ బెంచ్‌పై కూర్చుని ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లాడు. సలీంఖాన్‌ను, ఆయన కుమారుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని ఆ లేఖలో బెదిరించారు.

దీంతో సలీం ఖాన్ తన సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించి ఫిర్యాదు అందజేయడంతో బాంద్రా పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 (2) కింద కేసు నమోదు చేశారు. సోమవారం క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారుల బృందం, స్థానిక పోలీసులు సల్మాన్ ఖాన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

 లేఖ దొరికిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. లేఖలోని బెదిరింపు తీవ్రత దృష్ట్యా ఆ అగంతకుడి ఆచూకీ కనిపెట్టేందుకు సమీపంలోని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం