తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mrunal Thakur In Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో మృణాల్‌ ఠాకూర్‌, త‌మ‌న్నా

Mrunal Thakur in Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో మృణాల్‌ ఠాకూర్‌, త‌మ‌న్నా

20 October 2022, 9:45 IST

  • Mrunal Thakur in Lust Stories Sequel: ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటు ఈ సీక్వెల్‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారంటే...

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

Mrunal Thakur in Lust Stories Sequel: 2018లో నాలుగు క‌థ‌ల‌తో అంథాల‌జీ సినిమాగా తెర‌కెక్కిన ల‌స్ట్ స్టోరీస్ క్రిటిక‌ల్‌గా ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. మోడ్ర‌న్ రిలేష‌న్‌షిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో బోల్డ్ క‌థాంశంతో ల‌స్ట్ స్టోరీస్‌ను ద‌ర్శ‌కులు అనురాగ్ క‌శ్య‌ప్‌, దిబాక‌ర్ బెన‌ర్జీ, క‌ర‌ణ్ జోహార్‌, జోయా అక్త‌ర్ తెర‌కెక్కించారు. వైవాహిక బంధంలో మ‌హిళ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి, భ‌యాల‌ను బోల్డ్ పంథాలో తెర‌కెక్కించిన తీరు అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aavesham OTT Controversy: ప్రేక్షకులను బాధపెట్టిన ఓటీటీ మూవీ ఆవేశం.. భాషను అవమానించారంటూ ఫైర్

Brahmamudi: కావ్య మాటలకు ఖంగుతిన్న మామ సుభాష్- రాజ్‌తో సవాల్- శైలేంద్రకు తండ్రి వార్నింగ్- బయటపడనున్న మీరా ప్రెగ్నెన్సీ

ఇందులోని సీన్స్‌పై కొంద‌రు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేశారు. ఈ అంథాల‌జీ సినిమాలో కైరా అద్వాణీ, రాధికా ఆప్టే యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా ల‌స్ట్ స్టోరీస్‌కు సీక్వెల్‌ను తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్ తో పాటు త‌మ‌న్నా, కాజోల్, నీనా గుప్తా, అమృతా సుభాష్‌, విజ‌య్ వ‌ర్మ‌, తిలోత్త‌మా షోమ్‌, అంగ‌ద్‌ బేడీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ల‌స్ట్ స్టోరీస్ సీజ‌న్ 2కు అమిత్ శ‌ర్మ‌, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, ఆర్ బాల్కీ, సుజ‌య్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. సీజ‌న్ కూడా మ‌హిళ‌ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగ‌నున్న‌ట్లు, స‌మాజంలోని కొన్ని అపోహ‌ల్ని ఇందులో మోడ్ర‌న్ స్టైల్‌లో చెప్ప‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ల‌స్ట్ స్టోరీస్ సీజ‌న్ -2కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ ఆంథాల‌జీ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు తెలిసింది. ల‌స్ట్ స్టోరీస్ సీక్వెల్ కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రీలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం