తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Expensive Tv Show: ఒక్కో ఎపిసోడ్‌కు సలార్ బడ్జెట్ కంటే ఎక్కువే.. ప్రపంచంలోనే భారీ బడ్జెట్ టీవీ షో ఇదే

Most Expensive TV Show: ఒక్కో ఎపిసోడ్‌కు సలార్ బడ్జెట్ కంటే ఎక్కువే.. ప్రపంచంలోనే భారీ బడ్జెట్ టీవీ షో ఇదే

Hari Prasad S HT Telugu

29 December 2023, 7:41 IST

    • Most Expensive TV Show: సలార్ మూవీ బడ్జెట్ ఎంత? సుమారుగా రూ.400 కోట్లు. ఇదే మనకు భారీ బడ్జెట్. కానీ ఒక్కో ఎపిసోడ్ కు ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొంది ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ టీవీ షో ఏదో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన ది రింగ్స్ ఆఫ్ పవర్ వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన ది రింగ్స్ ఆఫ్ పవర్ వెబ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన ది రింగ్స్ ఆఫ్ పవర్ వెబ్ సిరీస్

Most Expensive TV Show: ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలను మించి అత్యున్నత ప్రమాణాలతో వెబ్ సిరీస్‌లు రూపొందుతున్న కాలం ఇది. అలాంటి టీవీ షోనే మనం చెప్పుకోబోయేది కూడా. ఈ టీవీ షో పేరు ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్. ఇది ప్రపంచలోనే అతి భారీ బడ్జెట్ వెబ్ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ ఖర్చు మన సలార్ మూవీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

సలార్ మూవీని రూ.270 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు మేకర్స్ చెప్పారు కదా. కానీ ఈ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.480 కోట్లు (5.8 కోట్ల డాలర్లు) ఖర్చు చేశారు. మొత్తంగా 8 ఎపిసోడ్ల షోని రూపొందించి, మార్కెటింగ్ చేయడానికి బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) ఖర్చు చేసినట్లు డెడ్‌లైన్ రిపోర్ట్ వెల్లడించింది.

ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్‌లతో సమానంగా..

మన ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ఆదిపురుష్ (రూ.550 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.500 కోట్లు)లను చెప్పుకుంటాం. కానీ ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ షో ఒక్కో ఎపిసోడ్ దాదాపు ఇంతే బడ్జెట్ తో రూపొందడం విశేషం. షో మొత్తం ప్రొడక్షన్ ఖర్చులు 46.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు)గా లెక్క తేల్చారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షోను రూపొందించింది.

అయితే ఇంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సిరీస్ ను ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం ఇక్కడ మరో చెప్పుకోదగిన విషయం. ఇప్పటికే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంఛైజీ నుంచి మూడు సినిమాలు వచ్చిన నేపథ్యంలో వాటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ కు ఇంత భారీ బడ్జెట్ పెట్టినా.. ఆ సినిమాలకు ఏమాత్రం సరితూగకపోవడంతో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.

నిజానికి ఈ షో చేయడానికి ఇంత భారీ బడ్జెట్ అవసరం లేదు. కానీ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం, పదేపదే రీషూట్లు చేయడంతో ఖర్చు అలా పెరుగుతూ వెళ్లింది. 15 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ సిరీస్ చేయాలని ప్రారంభిస్తే.. చివరికి మూడు రెట్లు పెరిగిపోయింది. ఇంతా చేసి చివరికి ట్రోలింగ్ కు గురి కావడమే విచిత్రంగా చెప్పొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం