తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maate Mamnthramu First Look: రెబల్ గర్ల్‌గా మేఘా ఆకాశ్.. మాటే మంత్రము మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Maate Mamnthramu First look: రెబల్ గర్ల్‌గా మేఘా ఆకాశ్.. మాటే మంత్రము మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

27 October 2022, 14:19 IST

    • Maate Mamnthramu First look: రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న మాటే మంత్రము ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడదుల చేసింది చిత్రబృందం. ఇందులో మేఘా రెబల్ గర్ల్‌గా కనిపించింది.
మాటే మంత్రము ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మాటే మంత్రము ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మాటే మంత్రము ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Maate Mamnthramu First look: రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నదీ సినిమా.

ట్రెండింగ్ వార్తలు

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

బుధవారం హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది. హాకీ స్టిక్ పట్టుకుని స్మోక్ చేస్తున్న కావ్య డ్రీమ్స్, హాబీస్, ఎమోషన్స్ అన్నీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..."ఇవాళ మా హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు. బర్త్ డే విశెస్ చెబుతూ ఆమె నటించిన కావ్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. కావ్య ఒక రెబల్ గర్ల్. మేఘా ఆకాష్ ను ఇప్పటిదాకా చూడని కొత్త క్యారెక్టర్ లో చూస్తారు. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేశాం" అన్నారు.

ఇందులో హీరోహీరోయిన్లుగా రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అర్జున్ కళ్యాణ్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి పనిచేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్ కమల్ చేస్తుండగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలను మనోజ్ రెడ్డి చూస్తున్నారు. పి.ఆర్.ఓ : జిఎస్ కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఏ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిమన్యు బద్ధి దర్శకత్వం వహిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం