తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Birthday: నా జీవితానికి అర్థం నువ్వే - న‌య‌న‌తారకు విఘ్నేష్ శివ‌న్ స్వీట్ బ‌ర్త్ డే విషెస్‌

Nayanthara Birthday: నా జీవితానికి అర్థం నువ్వే - న‌య‌న‌తారకు విఘ్నేష్ శివ‌న్ స్వీట్ బ‌ర్త్ డే విషెస్‌

18 November 2023, 17:39 IST

  • Nayanthara Birthday: న‌య‌న‌తార బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమెకు భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ పొయెటిక్ గా విషెస్ చెప్పాడు. నా జీవితానికి అర్ధం నీవే అంటూ న‌య‌న‌తార‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటిచెప్పాడు విఘ్నేష్ శివ‌న్‌.

న‌య‌న‌తార,  విఘ్నేష్ శివ‌న్
న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్

న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్

Nayanthara Birthday: న‌య‌న‌తార బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమెకు స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు విఘ్నేష్ శివ‌న్‌. శ‌నివారం నాటితో న‌య‌న‌తార 39వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. భార్య‌కు విఘ్నేష్ శివ‌న్ సోషల్ మీడియా ద్వారా పొయెటిక్‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. నయన్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటిచెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

నా జీవితానికి అర్థం నువ్వే...నువ్వు, నీ ఆనంద‌మే నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాయి. ల‌వ్ యూ మై ఉయిర్‌, ఉల‌గ‌మ్ న‌య‌న‌తార అంటూ విఘ్నేష్ శివ‌న్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశాడు.

త‌మిళంలో ఉయిర్ అంటే జీవితం, ఉల‌గ‌మ్ అంటే ప్ర‌పంచం అని అర్థం. త‌న జీవితం, లోకం మొత్తం న‌య‌న‌తారే అంటూ విఘ్నేష్ శివ‌న్ చేసిన ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. అంతే కాకుండా బ‌ర్త్ డే రోజు త‌మ‌ క‌వ‌ల పిల్ల‌ల‌తో క‌లిసి న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

ఈ ఫొటోలో డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్ లుక్‌లో న‌య‌న‌తార క‌నిపిస్తోంది. కాగా ఈ ఏడాది షారుఖ్‌ఖాన్ జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న‌తార‌. ఫ‌స్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్న‌ది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ 1150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం త‌మిళంలో ది టెస్ట్‌తో పాటు అన్న‌పూర్ణి, మంగ‌ట్టి సిన్స్ 1960 సినిమాలు చేస్తోంది న‌య‌న‌తార‌.

మ‌రోవైపు కాతు వ‌కుల రెండు కాద‌ల్ త‌ర్వాత అజిత్‌తో విఘ్నేష్ శివ‌న్ ఓ సినిమా చేయాల్సింది. కానీ అజిత్‌ ఇమేజ్ కు త‌గ్గ క‌థ సిద్ధం చేయ‌డంలో విఘ్నేష్ శివ‌న్ విఫ‌లం కావ‌డంతో ఈ కాంబో కార్య‌రూపం దాల్చ‌లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం