తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  2018 Movie: ఆస్కార్ రేసు నుంచి 2018 ఔట్ - క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డైరెక్ట‌ర్‌

2018 Movie: ఆస్కార్ రేసు నుంచి 2018 ఔట్ - క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డైరెక్ట‌ర్‌

22 December 2023, 13:54 IST

  • 2018 Movie: ఆస్కార్ రేసులో నుంచి మ‌ల‌యాళ మూవీ 2018 ఔట‌యింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో షార్ట్ లిస్ట్ అయిన 15 సినిమాల జాబితాను అకాడెమీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో 2018 మూవీకి చోటు ద‌క్క‌లేదు.

 2018 మూవీ
2018 మూవీ

2018 మూవీ

2018 Movie: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మ‌ల‌యాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేట‌గిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ ఇండియ‌న్ మూవీ చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. 96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన ప‌దిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు క‌నిపించ‌లేదు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేక‌పోయిన విష‌యాన్ని మూవీ డైరెక్ట‌ర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించాడు. ఈ లిస్ట్‌లో 2018 మూవీ లేక‌పోవ‌డం బాధ‌ను క‌లిగించింద‌ని జూడ్ ఆంథోనీ జోసెఫ్ అన్నాడు. ఆస్కార్‌కు 2018 నామినేట్ అవుతుంద‌ని ఎదురుచూసిన చాలా మంది అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచాన‌ని, వారంద‌రికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు జూడ్ ఆంథోనీ జోసెఫ్ త‌న పోస్ట్‌లో తెలిపాడు. ఇండియాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిల‌వ‌డం, దేశం త‌ర‌ఫున అఫీషియ‌ల్‌గా ఆస్కార్ ఎంట్రీని ద‌క్కించుకోవ‌డం అన్న‌ది

ఏ ఫిల్మ్ మేక‌ర్ కెరీర్‌లోనైనా అరుదైన ఘ‌న‌త‌గా చెప్ప‌వ‌చ్చు. జీవితం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని ఎన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని 2018 నాకు మిగిల్చింది అని జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. అత‌డి పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇండియా నుంచి ఆస్కార్స్ కోసం అఫీషియ‌ల్ ఎంట్రీగా 2018 మూవీని ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఎంపిక‌చేసింది.

2018లో సంభ‌వించిన కేర‌ళ వ‌ర‌ద విప‌త్తు నేప‌థ్యంలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. టోవినో థామ‌స్‌, కుంచ‌కోబోబ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి 2018 మూవీలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ ఏడాది మే నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మ‌ల‌యాళం 177 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా రికార్డు నెల‌కొల్పింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం