తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Okkadu Re Release Date: ఒక్క‌డు రీ రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్ - సంక్రాంతి బ‌రిలో మ‌హేష్‌

Mahesh Babu Okkadu Re Release Date: ఒక్క‌డు రీ రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్ - సంక్రాంతి బ‌రిలో మ‌హేష్‌

05 September 2022, 7:14 IST

  • Mahesh Babu Okkadu Re Release Date: మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగస్ట్ నెలలో రీ రిలీజ్ అయిన పోకిరి సినిమా రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తాజాగా అత‌డి మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా రీ రిలీజ్ కాబోతున్న‌ది. ఆ సినిమా ఏదంటే....

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు (Twitter)

మ‌హేష్‌బాబు

Mahesh Babu Okkadu Re Release Date: మ‌హేష్‌బాబు కెరీర్‌లో ఒక్క‌డు సినిమాకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. హీరోగా అత‌డి ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్క‌డు ఒక‌టి. ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈసినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా మ‌హేష్ యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ను అల‌రించాయి. 2003 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Blink OTT: ద‌స‌రా హీరో దీక్షిత్ శెట్టి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Brahmamudi May 15th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లి కోసం వెళ్లిన కావ్య కిడ్నాప్- 5 లక్షలకు బేరం- భార్యపై రాజ్‌కు ఆ డౌట్

ప‌ద‌మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఒక్కడు సినిమా న‌ల‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఆ స‌మ‌యంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. 2023 సంక్రాంతి స‌మ‌యానికి ఈ సినిమా విడుద‌లై ఇర‌వై ఏళ్లు పూర్త‌వుతాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఒక్క‌డు సినిమాను మ‌రోసారి రిలీజ్ రాబోతున్న‌ది. 2023 జ‌న‌వ‌రి 8న ఒక్కడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ విష‌యాన్ని నిర్మాత ఎం.ఎస్‌.రాజు ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. 4కేలో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా స్పెష‌ల్ షోస్ స్క్రీనింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ఒక్క‌డు రీ రిలీజ్‌ డేట్ అనౌన్స్ మెంట్ తో మ‌హేష్ ఫ్యాన్స్‌లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.

కాగా సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 2023 సంక్రాంతి స‌మ‌యంలో ప్ర‌భాస్ ఆదిపురుష్‌, చిరంజీవి బాబీ సినిమా, విజ‌య్ వార‌సుడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలోనే ఒక్క‌డు సినిమాను రీ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక్కడు సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం