తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharani Season 3 Teaser: మహారాణి మళ్లీ వస్తోంది.. ఇంట్రెస్టింగ్‌గా మూడో సీజన్ టీజర్

Maharani Season 3 Teaser: మహారాణి మళ్లీ వస్తోంది.. ఇంట్రెస్టింగ్‌గా మూడో సీజన్ టీజర్

Hari Prasad S HT Telugu

16 January 2024, 15:02 IST

    • Maharani Season 3 Teaser: మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ మంగళవారం (జనవరి 16) రిలీజ్ అయింది. ఈసారి హుమా ఖురేషీ మరింత పవర్‌ఫుల్ గా కనిపిస్తోంది.
మహారాణి వెబ్ సిరీస్ లో హుమా ఖురేషీ
మహారాణి వెబ్ సిరీస్ లో హుమా ఖురేషీ

మహారాణి వెబ్ సిరీస్ లో హుమా ఖురేషీ

Maharani Season 3 Teaser: ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ తో వస్తోంది. తాజాగా మంగళవారం (జనవరి 16) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజైంది. హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. రాణీ భారతి పాత్రలో హుమా చాలా పవర్‌ఫుల్ గా కనిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Suriya Hit List: హీరోగా తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. సూర్య చేతులమీదుగా హిట్ లిస్ట్ టీజర్

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. నాలుగో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలిన రాణి భారతి.. తాజాగా రానున్న సీజన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు టీజర్లో చూపించారు. తనకు చదువు రానప్పుడే మిమ్మల్ని ఆ స్థాయిలో టార్చర్ పెడితే.. ఇప్పుడు డిగ్రీ పాసైన తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అనే పవర్ ఫుల్ డైలాగ్ తో హుమా ఈ టీజర్లో ఎంట్రీ ఇచ్చింది.

త్వరలోనే మహారాణి మూడో సీజన్

మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీలివ్ వెల్లడించింది. చేతులకు బేడీలతో ఉన్న రాణి భారతి ఎంట్రీ కొత్త సీజన్ పై అంచనాలను పెంచేసింది. జైల్లో స్వీట్లు పంచుతున్న సీన్ తో ఈ టీజర్ మొదలవుతుంది. రాణి భారతి ఇంటర్మీడియట్ పాసైన సందర్భంగా స్వీట్లు పంచుతున్నట్లు చెబుతారు.

"పరీక్ష కోసం సంసిద్ధత కొనసాగుతోంది. మహారాణి మళ్లీ వస్తోంది" అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ను సోనీ లివ్ షేర్ చేసింది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్.. కొత్త సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేశారు.

1990లనాటి బీహార్‌ రాజకీయాలకు ఈ సిరీస్‌ అద్దం పట్టింది. ముఖ్యంగా అప్పటి బీహార్‌ రాజకీయ పరిణామాలు తెలిసిన వాళ్లయితే ఈ సిరీస్‌ను ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారు. మొదటి సీజన్‌ చూస్తుటే లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవిలు గుర్తుకు రావడం ఖాయం. నిజానికి వాస్తవ ఘటనల ఆధారంగానే ఈ సిరీస్‌ తెరకెక్కించినా.. వాటికి తమదైన ట్విస్టులు, డ్రామాను జోడించి మేకర్స్‌ మరింత రక్తి కట్టించారు.

తొలి సీజన్లో సీఎంగా ఉన్న తన భర్తపై హత్యా ప్రయత్నం జరగడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రాణి భారతి.. రెండో సీజన్లో మరింత పవర్‌ఫుల్ గా మారుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన భీమా భారతి మళ్లీ సీఎం పదవిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు.. వాటికి చెక్‌ పెట్టడానికి అప్పటికే పాలిటిక్స్‌లో ఆరితేరిన రాణి భారతి వేసే ఎత్తులు.. ఈ భార్యభర్తల గొడవలతోపాటు సున్నితమైన అంశాలను లేవనెత్తి రాజకీయంగా సొమ్ము చేస్తూ ప్రతిపక్ష నేత నవీన్‌ కుమార్‌ (అమిత్ సియాల్‌) సాగించే రాజకీయాలు.. ఇలా ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.

భీమా భారతి హత్యకు గురి కావడం, తర్వాత రాణి భారతి జైలుకు వెళ్లడంతో రెండో సీజన్ ఆసక్తికరంగా ముగుస్తుంది. అప్పుడే మూడో సీజన్ పై ఎంతో ఆసక్తి రేపుతుంది. ఈ సీజన్ ను జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో షూట్ చేయడం గమనార్హం. దీనిపై అక్కడి నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం