తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lsd Review: ఎల్ఎస్‌డీ రివ్యూ.. ఓటీటీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లవ్ సెక్స్ డెత్ ఎలా ఉందంటే?

LSD Review: ఎల్ఎస్‌డీ రివ్యూ.. ఓటీటీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లవ్ సెక్స్ డెత్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

06 February 2024, 7:09 IST

  • LSD Web Series Review In Telugu: లేటెస్ట్‌గా ఓటీటీలోకి వచ్చేన కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎల్ఎస్‌డీ (లవ్ సెక్స్ డెత్ సిరీస్). ఊహించని ఓటీటీ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఎల్ఎస్‌డీ రివ్యూలో తెలుసుకుందాం.

ఎల్ఎస్‌డీ రివ్యూ.. ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ సెక్స్ డెత్ ఎలా ఉందంటే?
ఎల్ఎస్‌డీ రివ్యూ.. ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ సెక్స్ డెత్ ఎలా ఉందంటే?

ఎల్ఎస్‌డీ రివ్యూ.. ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ సెక్స్ డెత్ ఎలా ఉందంటే?

టైటిల్: ఎల్ఎస్‌డీ (లవ్ సెక్స్ డెత్)

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటీనటులు: శివ కోన, ప్రాచీ ఠాకర్, ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, అభిలాష్ బండారి, రమ్య దినేష్, ఐ డ్రీమ్ అంజలి తదితరులు

కథ, దర్శకత్వం: శివ కోన

సంగీతం: ప్రవీణ్ మణి, శశాంక్ తిరుపతి

నిర్మాతలు: శివ కోన, అనిల్ మోదుగ

సినిమాటోగ్రఫీ: పవన్ గుంటుకు, హరీష్ ఎడిగ

ఎడిటింగ్: బసవ, శివ కోన

విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఎమ్ఎక్స్ ప్లేయర్

ఎపిసోడ్స్: 6 (ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నుంచి 40 నిమిషాలు)

Love Sex Death Web Series Review Telugu: ఈటీవీ ప్రభాకర్ ముఖ్య పాత్ర పోషించిన లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఎల్ఎస్‌డీ. లవ్ సెక్స్ డెత్ అనేది ఫుల్ ఫామ్. కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీసుగా వచ్చిన ఎల్ఎస్‌డీ ఫిబ్రవరి 2 నుంచి ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ చూస్తే టైటిల్‌కు తగినట్లుగా కట్ చేసి రిలీజ్ చేశారు. మరి ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోన్న ఈ లవ్ సెక్స్ డెత్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అమలాపురంలో వీరేంద్ర రాజు అలియాస్ రాజుగారు (ఈటీవీ ప్రభాకర్) కోడి పులావ్ అనే బిర్యానీకి చాలా ఫేమస్. ఇతర ప్రాంతాల నుంచి రాజుగారి కోడిపులావ్ తినేందుకు జనం ఎగబడతారు. దాంతో మీడియా ద్వారా కూడా చాలా ఫేమస్ అవుతుంది రాజుగారి కోడిపులావ్. జీవితంలో అంతా సంతోషంగా ఉన్న రాజుగారికి కూతురు, భార్య వల్ల మాత్రం అసంతృప్తి ఉంటుంది. ఈ క్రమంలో రాజుగారికి యాక్సిడెంట్ అయి వీల్ చైర్‌కు పరిమితం అవుతారు.

కట్ చేస్తే భార్యాభర్తలు బద్రి-ఆకాంక్ష (కునాల్ కౌశిక్-నేహా దేశ్ పాండే) తమ ఫ్రెండ్స్‌తో ఫారెస్ట్ ట్రిప్‌కు వెళ్తారు. తమ కూతురు ఫారెస్ట్‌కు వెళ్లొద్దని అక్కడ పెద్ద మాన్‌స్టర్ హెన్‌ డాడీ, మమ్మీని తినేస్తున్నట్లు కల వచ్చిందని చెబుతుంది. అయినా అదేం పట్టించుకోకుండా బద్రి-ఆకాంక్ష వెళ్తారు. దారిలో వారితోపాటు మరో రెండు జంటలు ఫరూక్-ఈషా (అభిలాష్ బండారి-రమ్య దినేష్), డానీ-క్యాండీ (శివ కోన-ప్రాచీ ఠాకర్) జాయిన్ అవుతారు. మూడు జంటలు సంతోషంగా కారులో ట్రిప్‌కు వెళ్తాయి.

ఫారెస్ట్‌లో కొంత దూరం వెళ్లాక కారు చెడిపోయి ఆగిపోతుంది. దాంతో అంతా ఫారెస్ట్‌లో కాటేజెస్ వరకు నడవాలనికుంటారు. ఈ క్రమంలో క్యాండీ చనిపోతుంది. తర్వాత ఒక్కొక్కరు కనిపించకుండా పోతుంటారు. క్యాండీ ఎలా చనిపోయింది? ఒక్కొక్కరిగా ఎందుకు మిస్ అవుతున్నారు? వాళ్లు ఏమైపోయారు? ఈ మూడు జంటలకు రాజుగారి కోడిపులావ్‌కు, రాజుగారికి ఏం సంబంధం? రాజుగారికి యాక్సిడెంట్ ఎలా అయింది? అనే తదితర విషయాలు తెలియాలంటే ఎల్ఎస్‌డీ చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఎల్ఎస్‌డీ అని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇంతకుముందు రాజుగారి కోడిపులావ్ అనే టైటిల్‌తో థియేటర్లలో విడుదలైంది. గతేడాది ఆగస్ట్ 4న థియేటర్లలో విడుదలైన రాజుగారి కోడిపులావ్ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు దీన్నే వెబ్ సిరీస్‌కు ఎపిసోడ్స్ ద్వారా మలిచి ఓటీటీలోకి వదిలారు. సుమారు 30 నుంచి 40 నిమిషాల ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్‌తో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎల్ఎస్‌డీ అఫైర్స్ పెట్టుకోవడం తప్పు అని చెప్పే మెసేజ్ ఒరియెంటెడ్ సిరీస్. కానీ, క్లైమాక్స్ వచ్చేసరికి అలాంటి ఫీలింగ్ కలిగేంతలా ఇంపాక్ట్ చూపించదు.

అమలాపురంలో గతంలో, ప్రస్తుతం జరుగుతున్న విషయాలను ప్యారలల్‌‌గా చూపిస్తూ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు. మూడు జంటలు ఫారెస్ట్‌లోకి వెళ్లాకే అసలు కథ స్టార్ట్ అవుతుంది. క్యాండీ చనిపోవడం, తర్వాత ఒక్కొక్కరుగా మిస్ అవడం, ఒకరిపై మరొకరికి అనుమానాలు రావడం, వాళ్లలో ఉన్న వ్యక్తిగత విబేధాలు, రిలేషన్స్, అఫైర్స్, ఫారెస్ట్‌లోనే అక్కడికక్కడే తిరగడం, చెట్లపై కోడి కాళ్ల మార్క్స్ కనిపించడం వంటి విషయాలతో బాగానే ఎంగేజ్ చేసింది. ఎపిసోడ్‌కు ఉండే టైటిల్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. వాటికి తగిన మీనింగ్ ఎపిసోడ్స్‌లో క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడేం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా కూడా చాలా వరకు చాలా స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో అయితే అంతా రివీల్ అవుతుంది అనుకున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టారు. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను 41 నిమిషాలతో చూపించారు. అయితే లెంత్ ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలా క్లారిటీ వస్తుంది అని సిరీస్‌లో డైలాగ్‌తో చెప్పించారు. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్టోరీస్‌ అప్పటివరకే ఆడియెన్స్ గెస్ చేసే అవకాశం ఉంది. దాంతో లాస్ట్ ఎపిసోడ్ బాగా సాగా దీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా వరకు గెస్ చేయోచ్చు.

కొన్ని సన్నివేశాలు ఇంపాక్ట్ చేయనివిధంగా చూపించారు. ముఖ్యంగా డ్యానీ పాత్ర బ్యాక్ గ్రౌండ్ స్టోరీని ఇంకాస్తా ఫోకస్‌డ్‌గా తెరకెక్కిస్తే ఆ క్యారెక్టర్ మరింత హైలెట్ అయ్యేది. కానీ ఆ పాత్ర చేసిన శివకోన నటనపరంగా బాగా హైలెట్ అవుతాడు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే కునాల్ కౌశిక్ నటనపరంగా మెప్పిస్తాడు. ప్రాచీ థాకర్, నేహా దేశ్ పాండే, అభిలాష్, ఈటీవీ ప్రభాకర్ మిగతా నటీనటులు అంతా తమ పాత్రలకు పర్ఫెక్ట్ న్యాయం చేశారు.

ఫైనల్‌గా చెప్పాలంటే..

బీజీఎమ్ బాగుంది. కానీ, కొన్ని చోట్ల మిక్సింగ్ సరిగా చేయలేదని అనిపించింది. యాక్టర్, నిర్మాత అండ్ డైరెక్టర్ శివ కోన కష్టం కనిపిస్తుంది. కంటెంట్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, కొన్ని సన్నివేశాలను ఇంకాస్తా మెరుగ్గా మలిచి ఉంటే ఎల్ఎస్‌డీ నెక్ట్స్ లెవెల్‌లో ఉండేది. ట్రైలర్‌లో చూపించినంతగా అడల్ట్ సీన్స్ పెద్దగా లేవు కానీ, ఫ్యామిలీతో చూసేందుకు ఇబ్బంది పడే సన్నివేశాలు, బూతు డైలాగ్స్ మాత్రం కొన్ని చోట్ల ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే టైటిల్‌కు తగినట్లుగా సాగే కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఎల్ఎస్‌డీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం