తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laal Singh Chaddha: బాక్సాఫీస్ వద్ద ఆమిర్, అక్షయ్ లకు షాక్ - పడిపోయిన లాల్ సింగ్ చడ్డా, రక్షాభందన్ కలెక్షన్స్

laal singh chaddha: బాక్సాఫీస్ వద్ద ఆమిర్, అక్షయ్ లకు షాక్ - పడిపోయిన లాల్ సింగ్ చడ్డా, రక్షాభందన్ కలెక్షన్స్

HT Telugu Desk HT Telugu

15 August 2022, 14:32 IST

  • ఆమిర్ ఖాన్(Aamir khan) లాల్ సింగ్ ఛడ్డా(laal singh chaddha), అక్షయ్ కుమార్ రక్షాభందన్ (Raksha Bandhan)సినిమాల వసూళ్లు ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ పూర్తయిన ఇప్పటివరకు వీటిలో ఏ సినిమా కూడా నలభై కోట్ల మార్కును దాటకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ (twitter)

అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, ఆక్షయ్ కుమార్ లకు ప్రేక్షకులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా, రక్షాభందన్ సినిమాల వసూళ్లు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా రెండు రోజుల్లో 18.96 కోట్ల వసూళ్లను రాబట్టగా రక్షాభందన్ కేవలం 14.60 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. ఫస్డ్ డే లాల్ సింగ్ చడ్డా 11 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా రక్షాభందన్ కేవలం 8.20 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించి నిరాశపరిచింది.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ఫస్ట్ వీకెండ్ లో ఆమిర్ లాల్ సింగ్ ఛడ్డా సినిమా కేవలం 37 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. నాలుగు రోజుల్లో యాభై కోట్ల మార్కును కూడా అందుకోలేక చతికిలపడింది. ఆమిర్ ఖాన్ కెరీర్ అత్యల్ప వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 180 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. సినిమా బడ్జెట్ నలభై శాతం కూడా రికవరీ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం రోజు ఈ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మరోవైపు అక్షయ్ కుమార్ రక్షాభందన్ సినిమా కూడా నాలుగు రోజుల్లో కేవలం 28.75 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఏడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లకు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రక్షా భందన్ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. భూమి ఫడ్నేకర్ కథానాయికగా నటించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం