తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya - Karthi: అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తానన్న కార్తీ.. ఆ క్యారెక్టర్లతో చేయాలని ఫ్యాన్స్ సూచన

Suriya - Karthi: అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తానన్న కార్తీ.. ఆ క్యారెక్టర్లతో చేయాలని ఫ్యాన్స్ సూచన

18 September 2023, 19:57 IST

    • Suriya - Karthi: స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కలిసి త్వరలో ఓ చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కార్తీనే ఓ హింట్ ఇచ్చారు.
Suriya - Karthi: అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తానన్న కార్తీ.. ఆ క్యారెక్టర్లతో చేయాలని ఫ్యాన్స్ సూచన
Suriya - Karthi: అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తానన్న కార్తీ.. ఆ క్యారెక్టర్లతో చేయాలని ఫ్యాన్స్ సూచన

Suriya - Karthi: అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తానన్న కార్తీ.. ఆ క్యారెక్టర్లతో చేయాలని ఫ్యాన్స్ సూచన

Suriya - Karthi: అన్నదమ్ములైన సూర్య, కార్తీ తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్నారు. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో కంగువ సినిమా చేస్తున్నారు. పీరియాడిల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, కార్తీ ప్రస్తుతం జపాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు సూర్య, కార్తీ కలిసి ఓ మూవీ చేయలేదు. ఈ తరుణంలో కార్తీకి ఓ ప్రశ్న ఎదురైంది. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారా అని క్వశ్చన్ వచ్చింది. దీనికి కార్తీ సమాధానం చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

తాజాగా, కార్తీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అన్న సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి కార్తీ సమాధానం చెప్పారు. ఇద్దరం కలిసి ఓ మంచి సినిమా చేయాలని అనుకుంటున్నట్టు అన్నారు. “ఒకే ఇండస్ట్రీలో సొంత అన్నదమ్ములు ఉండడం చాలా అరుదు. మేం ఇద్దరం కలిసి ఓ మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం. మొదట్లో నాకు భయంగా ఉండేది. అయితే, ఇప్పుడు ఇద్దరం కలిసి ఓ మూవీ చేయాలి” అని కార్తీ చెప్పారు. మొత్తంగా అన్న సూర్యతో కలిసి సినిమా చేస్తానని అన్నారు.

ఢిల్లీ, రోలెక్స్ పాత్రల్లో చేయాలంటూ..

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ చిత్రంలో ఢిల్లీ పాత్ర చేశారు కార్తీ. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక లోకేశ్ డైరెక్షన్‍లో వచ్చిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పవర్ ఫుల్ క్యామియో రోల్ చేశారు సూర్య. ఆ రోల్‍కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే విక్రమ్ చిత్రంలో ఢిల్లీ పేరు కూడా వస్తుంది. దీంతో, సూర్య, కార్తీ కలిసి ఓ సినిమా చేస్తే రోలెక్స్, ఢిల్లీ పాత్రతోనే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ మూవీ ఉండాలని సూర్య, కార్తీ ఫ్యాన్స్ కోరుతున్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తన చిత్రాలన్నింటికీ లింక్ ఉండేలా చేస్తున్నారు. ఖైదీ, విక్రమ్‍కు కూడా లింక్ ఉంది. సూర్యతో లోకేశ్ కనగరాజ్.. రోలెక్స్ మూవీని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరి, ఈ చిత్రంలో కార్తీ కూడా ఢిల్లీ పాత్రలో నటిస్తారనే అంచనాలు ఇప్పటికే వెల్లడవుతున్నాయి. ఖైదీ-2 మూవీ విషయంలోనూ ఇది సాధ్యమవుతుంది. మరి కార్తీ, సూర్య ఇదే ఆలోచిస్తారా.. లేకపోతే కాంబినేషన్ కోసం కొత్త సబ్జెక్ట్ తీసుకుంటారా అనేది చూడాలి.

సూర్య, కార్తీ కాంబినేషన్‍లో సినిమా వస్తే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టే అవకాశం ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం