తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudha Kongara Andhra Andagadu: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ఫ‌స్ట్‌ మూవీలో కృష్ణ భ‌గ‌వాన్ హీరో

Sudha Kongara Andhra Andagadu: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ఫ‌స్ట్‌ మూవీలో కృష్ణ భ‌గ‌వాన్ హీరో

14 November 2023, 11:45 IST

  • Sudha Kongara Andhra Andagadu: ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో డైరెక్ట‌ర్‌గా జాతీయ అవార్డును అందుకున్న‌ది సుధా కొంగ‌ర‌. సూర్య‌, మాధ‌వ‌న్‌, అక్ష‌య్‌కుమార్ వంటి టాప్ స్టార్ల‌తో సినిమాలు చేసింది. అయితే ఆమె ఫ‌స్ట్ మూవీలో హీరో కృష్ణ భ‌గ‌వాన్ కావ‌డం గ‌మ‌నార్హం

 ఆంధ్ర అంద‌గాడు
ఆంధ్ర అంద‌గాడు

ఆంధ్ర అంద‌గాడు

Sudha Kongara Andhra Andagadu: ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న‌ది ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర‌. సూర్య హీరోగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న‌ది. గురు, ఆకాశం నీ హ‌ద్దురా స‌క్సెస్‌ల‌తో సుధా కొంగ‌ర‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌, కోలీవుడ్ హీరోలు ఆస‌క్తిని చూపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma OTT: ఓటీటీలోకి ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Ranbir Kapoor Ramayana Budget: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే?

Manoj Bajpayee: నాన్నను చనిపోమన్నాను.. ఏడాదికే తల్లి మరణించింది: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయి

Netflix Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

ఆకాశం నీ హ‌ద్దురా సినిమాను హిందీలో రీమేక్ చేస్తోంది సుధా కొంగ‌ర‌. అక్ష‌య్ కుమార్ హీరోగా సూర్య గెస్ట్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ బాలీవుడ్ రీమేక్ త‌ర్వాత సూర్య‌తోనే మ‌రో మూవీ చేయ‌బోతున్న‌ది సుధా కొంగ‌ర‌. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. కోలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్న సుధా కొంగ‌ర సినీ ప్ర‌యాణం టాలీవుడ్ మూవీతోనే ప్రారంభ‌మైంది.

తెలుగులో కృష్ణ భ‌గ‌వాన్ హీరోగా 2008లో విడుద‌లైన ఆంధ్ర అంద‌గాడు సినిమాతో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చింది సుధా కొంగ‌ర‌. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా రిలీజైన సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు. ఆంధ్ర అంద‌గాడు మూవీలో అభిన‌య‌శ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాస‌రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ సినిమా ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో డైరెక్ట‌ర్‌గా సుధా కొంగ‌ర‌కు మ‌రో ఛాన్స్ ద‌క్క‌లేదు. మ‌ణిర‌త్నం వ‌ద్ద అసిస్టెంట్‌గా జాయిన్ ఆయిన సుధా కొంగ‌ర ఆ త‌ర్వాత మాధ‌వ‌న్ హీరోగా తెర‌కెక్కిన ఇరుది సుట్రు సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం