తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hrithik- Saba Azad Live In: 100 కోట్ల అపార్టుమెంటులో వారిద్దరూ.. బీచ్ హౌస్ కొనుగోలు..!

Hrithik- Saba Azad Live in: 100 కోట్ల అపార్టుమెంటులో వారిద్దరూ.. బీచ్ హౌస్ కొనుగోలు..!

18 November 2022, 17:14 IST

  • Hrithik- Saba Azad Live in: హృతిక్ రోషన్ తన లాంగ్ టైం గర్ల్ ప్రెండ్ సబా ఆజాద్ తో కలిసి ముంబయి మన్నత్ లో ఓ హౌస్ కు మారారట. వీరిద్దరూ అక్కడే ఉండబోతున్నారని మీడియా వర్గాల టాక్. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాడని సమాచారం. 

హృతిక్-,సబా ఆజాద్
హృతిక్-,సబా ఆజాద్

హృతిక్-,సబా ఆజాద్

Hrithik- Saba Azad Live in: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. సబా ఆజాద్‌తో చాలా కాలం నుంచి రిలేషన్‌లో ఉన్నాడని బీటౌన్‌లో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2014లో తన మాజీ భార్య సుజాన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న హృతిక్ ఆ తర్వాత సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నట్లు పలు ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఒకరినొకరికి సమయాన్ని కేటాయించుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఖరారరైంది. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం హృతిక్-సబా తమ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్.

ట్రెండింగ్ వార్తలు

Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

ముంబయిలోని మన్నత్ అనే ఇంటిని వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. రెండు అపార్ట్ముమెంట్లగా ఉన్న ఈ నివాసాన్ని హృతిక్ దాదాపు రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని సమాచారం. ముంబయిలోని జుహూ-వెర్సోవా లింక్ రోడ్డుకు సమీపంలో మన్నత్ ఉంది. రెండు అపార్ట్మెంట్లు కలిపి రూ.97.50 కోట్లని సమాచారం. హృతిక్-సబా కొత్త ఇళ్లు నుంచి అరేబియన్ సముద్రం క్లియర్‌గా కనిపిస్తుందట. 38 వేల చదరపు అడుగులు విశాలంతో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి.

ఓ అపార్ట్మెంటులో 15, 16వ ఫ్లోరులో డూప్లెక్స్ కోసం పునర్నిర్మాణం చేస్తున్నారట. ఇందుకోసం హృతిక్ దాదాపు రూ.67.50 కోట్లను ఖర్చు చేస్తున్నారట. మరో అపార్ట్మెంట్‌ కోసం రూ.30 కోట్లు వెచ్చించారని సమాచారం. తాజాగా వస్తున్న నివేదికల ప్రకారం హృతిక్, సబా కొంతకాలం పాటు అక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నారట. త్వరలోనీ వీరి కొత్త హౌస్‌లోకి గృహప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది.

హృతిక్-సబా కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. గత నెలలో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌ కూడా హృతిక్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. హృతిక్ గతంలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 2014లో వీరు విడిపోయారు. వీరికి హృదాన్ రోషన్, హ్రేహాన్ రోషన్ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. హృతిక్ చివరగా విక్రమ్ వేదలో కనిపించారు. ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలైంది. సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే తదితరులు నటించారు. ప్రస్తుతం దీపికా పదుకొణెతో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం