తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Highest Paid Tv Actress: ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ నటి ఈమే.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు

Highest Paid TV Actress: ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టీవీ నటి ఈమే.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు

Hari Prasad S HT Telugu

11 January 2024, 16:15 IST

    • Highest Paid TV Actress: టీవీ నటులకు ఫుల్ డిమాండ్ ఉన్న ఈ రోజుల్లో ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి ఎవరో తెలుసా? ఈమె ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.3 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం.
నటి రూపాలీ గంగూలీ
నటి రూపాలీ గంగూలీ

నటి రూపాలీ గంగూలీ

Highest Paid TV Actress: మన దేశంలో సినిమా స్టార్ల రేంజ్ లో టీవీ నటులకూ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లూ వాళ్ల సొంతం. అయితే ఈ నటీమణుల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ఎవరో తెలుసా? ఆమె ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.3 లక్షలు వసూలు చేస్తుందంటే నమ్మగలరా? ఈ నటి పేరు రూపాలీ గంగూలీ.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

చాలా రోజులుగా హిందీలో టాప్ సీరియల్ గా కొనసాగుతున్న అనుపమలో నటిస్తున్న రూపాలీ గంగూలీ.. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి కావడం విశేషం. ఎప్పుడో ఏడేళ్ల వయసులో 1985లో తన తండ్రి డైరెక్ట్ చేసిన సాహెబ్ మూవీలో బాలనటిగా కనిపించిన రూపాలీ.. 2000వ ఏడాదిలో బుల్లితెరపై అడుగుపెట్టింది.

ఒక్కో ఎపిసోడ్ రూ.3 లక్షలు

హిందీలో హీనా ఖాన్, రూబినా మాలిక్, తేజస్వి ప్రకాశ్ లాంటి వాళ్లకు గట్టి పోటీ ఇస్తూ.. టాప్ నటిగా ఎదిగింది. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.3 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరింది. డైరెక్టర్ అయిన అనిల్ గంగూలీ కూతురే ఈ రూపాలీ గంగూలీ. 2000లో సుకన్య అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. అయితే సారాభాయ్ వెర్సెస్ సారాభాయ్ కామెడీ సీరియల్ తో పేరు సంపాదించింది.

2004లో ప్రారంభమైన ఈ సీరియల్లో మొత్తం 80 ఎపిసోడ్లు ఉన్నాయి. దీనితో ఆమె ఓ స్టార్ గా ఎదిగిపోయింది. ఆ వెంటనే 2006లో తొలిసారి ఇండియాకు వచ్చిన బిగ్ బాస్ షో తొలి సీజన్ లోనే పార్టిసిపేట్ చేసింది. పదో వారం వరకూ హౌజ్ లో ఉండి తర్వాత ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత రియాల్టీ షో ఖత్రోంకీ ఖిలాడీ షో కూడా చేసింది.

ఇక 2020 నుంచి టెలికాస్ట్ అవుతున్న అనుపమ సీరియల్లో నటిస్తోంది. ఈ సీరియల్ చాలా రోజులుగా ఇండియాలోనే టాప్ సీరియల్ గా కొనసాగుతోంది. టీవీల్లో నటించడం ద్వారానే రూపాలీ గంగూలీ.. రూ.20 కోట్ల సంపదను కలిగి ఉండటం విశేషం. ఆమె వ్యాపారవేత్త అశ్విన్ కే వర్మను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.

అత్యధిక రెమ్యునరేషన్ అతడికే..

టీవీ నటీమణుల్లో అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకున్నా.. ఓవరాల్ గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం.

ది కపిల్ శర్మ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్, కామెడీ సర్కస్, లాఫ్టర్ ఛాలెంజ్ లాంటి షోలు కపిల్ శర్మ చేశాడు. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా పాపులర్.

ఇక నటీమణుల్లోనూ సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన టీవీ నటిగా నిలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం