తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Vikram: హీరో విక్రమ్ కు హార్ట్ ఎటాక్...

Hero Vikram: హీరో విక్రమ్ కు హార్ట్ ఎటాక్...

HT Telugu Desk HT Telugu

08 July 2022, 15:01 IST

  • తమిళ అగ్ర కథానాయకుడు విక్రమ్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  

విక్రమ్
విక్రమ్ (twitter)

విక్రమ్

తమిళ హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్నిహాస్పిటల్ కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం వైద్యులు విక్రమ్ కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

మైల్డ్ హార్ట్ ఎటాక్ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు కొద్ది రోజులుగా ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు. విక్రమ్ అరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు అజ‌య్ జ్ఞాన‌ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ లో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం