తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 59: గీతూ ఇక మారదా.. బాలాదిత్య వీక్నెస్‌తో ఆడుకున్న వైనం.. ఇనాయాను రెచ్చగొట్టిన శ్రీసత్య..!

Bigg Boss Telugu 6 Episode 59: గీతూ ఇక మారదా.. బాలాదిత్య వీక్నెస్‌తో ఆడుకున్న వైనం.. ఇనాయాను రెచ్చగొట్టిన శ్రీసత్య..!

02 November 2022, 7:16 IST

    • Bigg Boss Telugu 6 Episode 59: బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ రసవత్తరంగా మారింది. బాలాదిత్య వీక్నెస్‌తో గీతూ ఆడుకుంది. అతడి సిగరెట్ల దాచి ఎమోషనల్ అయ్యేలా చేసింది. మరోపక్క ఇనాయాను పదే పదే వెన్నుపోటు అని చెబుతూ శ్రీసత్య ఆమెను రెచ్చగొట్టింది.
బిగ్‌బాస్ 9వ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్
బిగ్‌బాస్ 9వ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్

బిగ్‌బాస్ 9వ వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్

Bigg Boss Telugu 6 Episode 59: బిగ్‌బాస్ 9వ వారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈ సారి ఎక్కువ మంది ఇనాయాను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను ఫేక్ అంటూ, సూర్య ఆమె వెళ్లిపోయాడంటూ నామినేషన్ల వర్షం కురిపించారు. దీంతో అందరూ తననే టార్గెట్ చేశారంటూ, సూర్య వెన్నుపోటు పొడిచానని చెప్పడం లాంటివి తట్టుకోలేక.. ఇనాయా బాత్రూంలోపలకు వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తుంటుంది. మరోపక్క శ్రీహాన్, శ్రీసత్య, గీతూ .. ఇనాయా ఫేక్ అంటూ ముచ్చటిస్తుంటారు. ఆమెనే సూర్యను నామినేట్.. తిరిగి ఆమె ఎమోషన్ అవ్వడం ఎందుకు? ఇనాయా ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదనే రీతిలో ఫైమాకు నూరిపోస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

బాత్రూంలో ఏడుస్తున్న ఇనాయా.. బయట ఎవ్వరికీ కనిపించకపోయే సరికి.. రేవంత్.. ఇనాయా ఎక్కడ అంటూ అందర్నీ అడుగుతుంటారు. చివరకు బాత్రూంలో ఉందని తెలుసుకున్న హౌస్ మేట్స్, ఆమెను ఎంత సేపు పిలిచిన డోర్ తీయదు. దీంతో డోర్ పగులకొడతానని రేవంత్ అంటాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆదేశంతో ఇనాయా.. బయటకు వచ్చి కన్ఫెషన్ రూంలోకి వెళ్తుంది. నేను వెళ్లిపోతాను బిగ్‌బాస్.. నన్ను పంపించేయండి అంటూ ఇనాయా అనడంతో..ఆమెలో స్ఫూర్తిని నింపిన బిగ్‌బాస్ తిరిగి లోపలకు పంపిస్తాడు.

అనంతరం ఇంటి తదుపరి కెప్టెన్సీ కోసం పోటీదారుల టాస్క్‌ను హౌస్ మేట్స్‌కు ఇస్తాడు బిగ్‌బాస్. మిషన్ పాజిబుల్ అనే ఈ టాస్క్‌లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడిపోమంటాడు. కొంతమంది రెడ్ టీమ్‌లో ఉండగా.. మరికొంతమంది బ్లూటీమ్‌గా ఉంటారు. వారి డ్రెస్‌‌పై నాలుగు ఎరుపు లేదా బ్లూ స్ట్రిప్స్ ఉంటాయి. వాటిని లాగేస్తే ఆ వ్యక్తి చనిపోయినట్లు లెక్క. అలా ఏ జట్టు సభ్యులు ఎక్కువ మంది చనిపోతారో వారు ఓడిపోయినట్లుగా చెబుతారు. అయితే టీమ్‌ల ఎంపికలోనూ శ్రీసత్య పక్షపాతం వహించింది. ఏకాభిప్రాయంతో హౌస్ మేట్స్ రెండు జట్లుగా విడిపోవాలని ఆదేశిస్తే.. శ్రీసత్య మాత్రం తన స్నేహితులైన శ్రీహాన్, రేవంత్, గీతూ, ఫైమాను తన జట్టులోకి తీసుకుంటుంది. వీరితో పాటు కీర్తి కూడా ఉంటుంది. ఆదిరెడ్డి ఈ విషయం గురించ పదే పదే హెచ్చరించినా ఆమె ఒప్పుకోదు. భుజంతోనే కాకుండా.. బుద్ధిబలంతో కూడా ఆడాలని బిగ్‌బాస్ చెబుతాడు.

గీతూపై ఫుల్ ఫైర్ అయిన బాలాదిత్య..

టాస్క్ ప్రారంభమైన తర్వాత అయితే మొదట రెడ్ టీమ్‌కు చెందిన ఫైమా స్ట్రిప్స్‌ను బ్లూ టీమ్ సభ్యులు లాగేశారు. దీంతో బిగ్‌బాస్ ఫైమా చనిపోయినట్లుగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే బాలాదిత్య సిగరెట్లు, లైటర్‌ను శ్రీసత్య, గీతూ దాచిపెట్టేస్తారు. అనంతరం బాలాదిత్య తన సిగరెట్లు, లైటర్ ఇవ్వాలని ప్రాధేయపడతారు. ఇవ్వాలంటే రెండు స్ట్రిప్స్ తొలగించుకోవాలని, అప్పుడే ఇస్తామని అతడి బలహీనతతో ఆడుకుంటారు. నా ఒక్కడి కోసం టీమ్ మొత్తాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ఇష్టలేదని, బతిమలాడుతున్నానని, సీరియస్ చేయొద్దని హెచ్చరిస్తాడు. అయినా ఎంతకీ గీతూ అస్సలు కరగదు. నిన్ను చెల్లెలు అనుకున్నానని, అలా ఎందుకో అన్నానో అని రిగ్రెట్ ఫీలయ్యేలా చేయొద్దని గీతూపై ఫైర్ అవుతాడు. నీకు సిగ్గు లేదు.. ఎదుటివారి వీక్నెస్‌తో ఆడుకుంటావ్ అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇతరుల వీక్నెస్‌తో ఆడుకోవద్దని గతవారం నాగార్జున హెచ్చరించినా సరే గీతూలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పైపెచ్చు వెటకారంగా సమాధానం చెప్పడం, వెకిలి నవ్వులు ఆమెపై ఆడియెన్స్‌ కోపం తీవ్రమైంది.

ఇదిలా ఉంటే బ్లూ టీమ్ సభ్యులు.. రెడ్ టీమ్‌ను ఓ పక్క కార్నర్ చేస్తారు. ఇందులో భాగంగా శ్రీహాన్‌, కీర్తిని పట్టుకోగా.. బాలాదిత్యను రెడ్ టీమ్ వారు పట్టుకుంటారు. కీర్తి తలకు తగడలంతో ఆమెను వదిలిస్తారు.. బాలాదిత్య స్ట్రిప్స్ తీసేస్తారు రేవంత్ టీమ్. బాలాదిత్య కూడా శ్రీహాన్ స్టిప్స్ తీస్తాడు. అయితే ముందుగా బాలాదిత్యను చంపేయడంతో.. ఆ తర్వాత అతడు తీసిన శ్రీహాన్ స్ట్రిప్స్‌ను బిగ్‌బాస్ కన్సిడర్ చేయరు. ఫలితంగా శ్రీహాన్‌కు లైఫ్ లభిస్తుంది. మరోపక్క కీర్తి తలకు దెబ్బ తగలడంతో ఆమె స్థానంలో చనిపోయిన ఫైమా ఆడుతుందని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు.

ఇనాయాను పదే పదే రెచ్చగొట్టిన శ్రీసత్య-శ్రీహాన్..

బాలాదిత్య సిగరెట్ల విషయంలో ఇనాయా, శ్రీహాన్- శ్రీసత్య మధ్య మాటల వార్ జరుగుతుంది. గేమ్ ఆడటం నేర్చుకోండి ముందు, తర్వాత దొంగతనం చేయొచ్చు అంటూ ఇనాయా.. శ్రీహాన్-శ్రీసత్యపై పైర్ అవుతుంది. మేము గేమే ఆడుతున్నాం.. నీలాగా ఫ్రెండ్‌కు వెన్ను పోటు పొడవలేదు.. నా ఫ్రెండ్‌ను నేను కాపాడుకున్నా అంటూ శ్రీసత్య ఇనాయాను మరింత రెచ్చిగొడుతుంది. యాక్షన్ చేసి మరీ చూపెడుతూ.. ఆమె ప్రవర్తన ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. సూర్యను ఇనాయా వాడుకుందని చెప్పిన శ్రీసత్య.. తను అర్జున్‌ను అవసరానికి వాడుకున్న సంగతి ఎందుకు మరిచిందో అర్థం కావట్లేదు.

గీతూ ఇంక మారదా..

మరోపక్క బెడ్రూంలో బాలాదిత్య దాచుకున్న సిగరెట్లను మళ్లీ దొంగిలిస్తారు శ్రీసత్య, గీతూ. ఈ సారి కూడా అతడు బతిమాలాడినా ఇవ్వరు. ఓ పక్క బాలాదిత్య అన్న మాటలకు ఆదిరెడ్డితో వచ్చి ఫీలయ్యి ఏడ్చిన గీతూ.. మళ్లీ అదే తప్పు చేయడం ఆడియెన్స్‌కు ఆమెపై మరింత ఆగ్రాహానికి కారణమవుతుంది. ఇలా ఇందుకు చేస్తున్నారంటూ గట్టిగా అడుగుతాడు బాలాదిత్య. అయినా కూడా శ్రీసత్య, గీతూ కనికరించరు. ఎంతలా అంటూ తన టీమ్‌కే చెందిన రేవంత్.. అలా చేయొద్దని గట్టిగా వారించినా గీతూ, శ్రీసత్య తమ పంథాలోనే వెళ్తారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం