తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hari Hara Veera Mallu Location Photos: హరి హర వీర మల్లు సెట్స్‌లో హరీష్‌ శంకర్‌.. ఫొటోలతో సర్‌ప్రైజ్‌ చేసిన డైరెక్టర్‌

Hari Hara Veera Mallu Location Photos: హరి హర వీర మల్లు సెట్స్‌లో హరీష్‌ శంకర్‌.. ఫొటోలతో సర్‌ప్రైజ్‌ చేసిన డైరెక్టర్‌

HT Telugu Desk HT Telugu

09 December 2022, 15:24 IST

    • Hari Hara Veera Mallu Location Photos: హరి హర వీర మల్లు సెట్స్‌లో హరీష్‌ శంకర్‌ కనిపించాడు. పవన్‌తోపాటు డైరెక్టర్‌ క్రిష్‌తోనూ తాను దిగిన ఫొటోలను షేర్‌ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు.
హరి హర వీర మల్లు సెట్స్ లో పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్
హరి హర వీర మల్లు సెట్స్ లో పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్

హరి హర వీర మల్లు సెట్స్ లో పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్

Hari Hara Veera Mallu Location Photos: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా అతని ఫ్యాన్స్‌కు పండగే. అందులోనూ షూటింగ్‌ లొకేషన్‌ ఫొటోలు బయటకు వస్తే ఇంకెలా ఉంటుంది. ప్రస్తుతం పవన్‌ హరి హర వీర మల్లు షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలుసు కదా. ఓవైపు పొలిటికల్‌గా బిజీగా ఉంటూనే.. గ్యాప్‌లో ఈ మూవీ షూటింగ్‌ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన స్పెషల్‌ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తుండటంతో అప్పటిలోపు మిగిలిపోయిన షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్‌ చాలా ఆలస్యమైంది. అయితే తాజాగా షూటింగ్‌ లొకేషన్‌లో డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌ ప్రత్యక్ష్యమయ్యాడు.

పవన్‌ తన తర్వాతి సినిమా భవదీయుడు భగత్‌సింగ్‌ను హరీశ్‌తోనే చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్‌ చేసినా.. ఆ తర్వాత పవన్‌కు టైమ్‌ లేక పక్కన పెట్టేశారు. దీన్నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా హరి హర వీర మల్లు సెట్స్‌లో పవన్‌ను హరీశ్‌ కలవడంతో ఆ సినిమాలోనూ కదలిక వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

నెక్ట్స్‌ మూవీ గురించి ఇక్కడే డిస్కషన్స్‌ కోసం హరీశ్‌ను పవన్‌ పిలిచాడా అన్న సందేహాలూ ఉన్నాయి. సెట్స్‌లో పవన్‌ కల్యాణ్‌తోపాటు డైరెక్టర్‌ క్రిష్‌తో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా హరీశ్‌ శంకర్‌ షేర్‌ చేసుకున్నాడు. ఈ మధ్యే సెట్స్‌లో పవన్‌ ఫొటోలు తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. రెడ్‌షర్ట్‌, బ్లాక్‌ దోతీలో పవన్‌ కనిపించాడు. అతని హెయిర్‌స్టైల్‌, గడ్డంలో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం