తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman 3 Days Box Office Collections: మూడో రోజు దుమ్మురేపిన హనుమాన్.. మరింత పెరిగిన కలెక్షన్లు

Hanuman 3 Days Box Office Collections: మూడో రోజు దుమ్మురేపిన హనుమాన్.. మరింత పెరిగిన కలెక్షన్లు

Hari Prasad S HT Telugu

15 January 2024, 8:45 IST

    • Hanuman 3 Days Box Office Collections: హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. తొలి రెండు రోజుల కంటే మూడో రోజు కలెక్షన్లు మరింత పెరగడం విశేషం.
హనుమాన్ మూవీలో తేజ సజ్జ
హనుమాన్ మూవీలో తేజ సజ్జ

హనుమాన్ మూవీలో తేజ సజ్జ

Hanuman 3 Days Box Office Collections: హనుమాన్ మూవీ కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ సినిమా హడావిడి.. క్రమంగా పెరుగుతూనే ఉంది. ఓవైపు గుంటూరు కారంతోపాటు మిగతా సంక్రాంతి సినిమాలకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

తొలి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరగడం విశేషం. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు రెట్టింపయ్యాయి. రెండో రోజైన శనివారం ఈ సినిమా రూ.3.9 కోట్లు వసూలు చేయగా.. మూడో రోజు రూ.7 కోట్ల వరకూ కలెక్షన్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగులో మూడో రోజు రూ.10 కోట్లకుపైనే కలెక్షన్లు వచ్చాయి.

గుంటూరు కారం మూవీని మించి..

హనుమాన్ మూడో రోజు గుంటూరు కారం మూవీని మించి కలెక్షన్లు రాబట్టడం విశేషం. తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ తో మొదలైనా.. మూవీకి నెగటివ్ టాక్ రావడంతో క్రమంగా గుంటూరు కారం కలెక్షన్లు తగ్గుతూ వెళ్తున్నాయి. మరోవైపు హనుమాన్ కు వచ్చిన పాజిటివ్ టాక్ తో ఈ మూవీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. గుంటూరు కారం మూడో రోజు రూ.15 కోట్లు వసూలు చేసింది.

హనుమాన్ మాత్రం అన్ని భాషల్లో కలిపి రూ.18 కోట్ల వరకూ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజులు కలిపి రూ.66 కోట్ల వరకూ వసూలు చేసినట్లయింది. ఇండియాలోనే రూ.42 కోట్ల వరకూ వచ్చాయి. తెలుగులో రూ.29 కోట్లు, హిందీలో రూ.13 కోట్లు వసూలు చేసింది. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రం ఊహించినంత రెస్పాన్స్ రావడం లేదు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సంక్రాంతికి రిలీజైన చిన్న సినిమా ఇది. ముగ్గురు పెద్ద హీరోల మధ్య ఈ మూవీ నిలుస్తుందా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక నార్త్ లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కూడా హనుమన్ కు మరింత క్రేజ్ తీసుకొస్తోంది.

హనుమాన్ సక్సెస్ అయితే.. ఇలాంటి సూపర్ హీరో సినిమాలు మొత్తం 12 తీస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీ సక్సెస్ తో హనుమాన్ టీమ్ మొత్తం ఎంతో ఆనందంతో ఉంది.

హనుమాన్ ఎలా ఉందంటే?

హనుమాన్ ఎంగేజింగ్‍గా సాగే సూపర్ హీరో స్టోరీ. సూపర్ హీరో విన్యాసాలు, వినోదం, ఆధ్యాత్మికత, మెరుగైన వీఎఫ్‍ఎక్స్, ఎలివేషన్లు, గూజ్‍బంప్స్ మూవ్‍మెంట్లతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

కొన్ని చోట్ల లాగ్ అనిపించినా.. కాసేపటికే మళ్లీ సినిమాటిక్ హై ఇస్తుంది. మూవీలో లీనమయ్యేలా చేస్తుంది. హనుమాన్.. థియేటర్లలోనే చూడాల్సి సినిమా.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం