తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika: అమ్మ డెర్మటాలజిస్ట్.. స్కిన్ మాఫియా ఉంది.. హన్సిక కామెంట్స్ వైరల్

Hansika: అమ్మ డెర్మటాలజిస్ట్.. స్కిన్ మాఫియా ఉంది.. హన్సిక కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu

17 November 2023, 11:15 IST

  • Hansika About Skin Mafia: దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా నటించిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. స్కిన్, మెడికల్, ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్లలో హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

స్కిన్ మాఫియాపై హన్సిక మై నేమ్ ఈజ్ శృతి.. అమ్మ డెర్మటాలజిస్ట్ అంటూ కామెంట్స్
స్కిన్ మాఫియాపై హన్సిక మై నేమ్ ఈజ్ శృతి.. అమ్మ డెర్మటాలజిస్ట్ అంటూ కామెంట్స్

స్కిన్ మాఫియాపై హన్సిక మై నేమ్ ఈజ్ శృతి.. అమ్మ డెర్మటాలజిస్ట్ అంటూ కామెంట్స్

Hansika About My Name Shruti Movie: దేశ‌ముదురు మూవీతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే సూపర్ క్రేజ్ అందుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన హన్సిక న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Mohanlal L2 Empuraan first look: మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మలయాళ స్టార్

Dhee Promo: ఢీషోకు స్పెష‌ల్ గెస్ట్‌గా కాజ‌ల్ - గ్రాండ్ ఫినాలే చేరుకునే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

Harom Hara Release Date: హరోం హర కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఆ పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు మూవీ

Mohan Lal Birthday: జనతా గ్యారేజ్ కంటే 22 ఏళ్ల ముందే బాల‌కృష్ణ‌తో తెలుగులో సినిమా చేసిన మోహ‌న్‌లాల్ - ఆ మూవీ ఏదంటే?

ఇదే తొలిసారి

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హన్సిక పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. "థ్రిల్లర్‌ చిత్రాలను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే" అని హన్సిక తెలిపింది.

స్కిన్ మాఫియా ఉందా?

"శృతి ఒక పోరాట యోధురాలు, ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేనికీ వెనకడుగు వేయదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది" అని హన్సిక చెప్పుకొచ్చింది.

సవాలుతో సాగిన మూవీ

"స్కిన్ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఫేస్ చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది" అని హన్సిక వెల్లడించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం