తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 9th Episode: శైలేంద్ర దొంగ బుద్ధి రిషికి తెలిసిందా? - త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా?

Guppedantha Manasu May 9th Episode: శైలేంద్ర దొంగ బుద్ధి రిషికి తెలిసిందా? - త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకున్నాడా?

HT Telugu Desk HT Telugu

09 May 2023, 10:58 IST

  • Guppedantha Manasu: శైలేంద్ర‌, దేవ‌యాని క‌లిసి రిషికి ఎలాంటి ఆప‌ద త‌ల‌పెడ‌తారో అని జ‌గ‌తి త‌ల్ల‌డిల్లిపోతుంది. త‌ల్లి సంఘ‌ర్ష‌ణ‌ను రిషి అర్థం చేసుకున్నాడా లేదా అన్న‌ది తెలియాలంటే నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ చూడాల్సిందే...

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu: రిషి చేతిలో నుండి డీబీఎస్‌టీ కాలేజీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప‌ద‌విని లాగేసుకోవాల‌ని త‌ల్లితో క‌లిసి శైలేంద్ర ప్లాన్‌ వేస్తాడు. ఆ ప‌నిని జ‌గ‌తి చేతే చేయించాల‌ని అనుకుంటారు. తాము చెప్పిన‌ట్లు న‌డుచుకోక‌పోతే రిషిని చంపేస్తామ‌ని బెదిరిస్తారు. దాంతో జ‌గ‌తి ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను మ‌హేంద్ర‌, వ‌సుధార ఓదార్చుతారు.

ట్రెండింగ్ వార్తలు

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

అంత‌లోనే రిషి అక్క‌డికి రావ‌డంతో అత‌డి గుండెల‌పై వాలి ఏడుస్తుంది. ఆ స‌మ‌యంలో రిషిలో త‌ల్లి ప‌ట్ల ఉన్న దాగి ఉన్న ప్రేమ బ‌య‌ట‌కు వ‌స్తుంది. త‌ల్లి ప్రేమ‌ను రిషి గుర్తించాడా? మేడ‌మ్ అంటూఇన్నాళ్లు జ‌గ‌తిని పిలిచిన రిషి ఆమెను అమ్మ అని మొద‌టిసారి పిలిచాడా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

అంతే కాకుండా శైలేంద్ర‌, దేవ‌యాని నిజ‌స్వ‌రూపం గురించి జ‌గ‌తి చెప్పిన మాట‌ల‌ను రిషితో పాటు మ‌హేంద్ర న‌మ్ముతారా? త‌ప్పుడు మాట‌లుగా కొట్టిపారేస్తారా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. త‌న ప్లాన్ గురించి రిషితో చెబితే అత‌డిని చంపేస్తాన‌ని జ‌గ‌తిని బెదిరించిన మ‌హేంద్ర అన్న‌ట్లుగానే చేశాడా అన్న‌ది కూడా మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

డిస్నీ హాట్‌స్టార్‌లో నేటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆల‌స్యం

ప్ర‌జెంట్ టాప్ టెన్ తెలుగు సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు కొన‌సాగుతోంది. ఈ సీరియ‌ల్‌ను టీవీలో ఫాలో అయ్యే ఆడియెన్స్ సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. అంతే కాకుండా ఓటీటీలో చాలా మంది ఆడియెన్స్ ఈ సీరియ‌ల్‌ను చూస్తుంటారు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ప్ర‌తి రోజు ఉద‌యం ఏడు గంట‌ల లోపే కొత్త ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ కోసం అప్‌లోడ్ చేస్తుంటారు. మంగ‌ళ‌వారం మాత్రం టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా సీరియ‌ల్‌ను అప్‌లోడ్ చేయ‌క‌పోవ‌డంలో సీరియ‌ల్ ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతోన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం