తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 26th Episode: దేవయాని కొడుకొచ్చాడు.. శైలేంద్ర ఇంటికొచ్చాడు.. రిషి-వసు లైఫ్‌లోకి కొత్త కష్టాలు?

Guppedantha Manasu April 26th Episode: దేవయాని కొడుకొచ్చాడు.. శైలేంద్ర ఇంటికొచ్చాడు.. రిషి-వసు లైఫ్‌లోకి కొత్త కష్టాలు?

26 April 2023, 7:36 IST

    • Guppedantha Manasu April 26th Episode: గుప్పెడంత మనసులో నేటి ఎపిసిడో‌లో దేవయాని-ఫణీంద్ర కుమారుడు శైలేంద్ర భూషణ్ ఎంట్రీ ఇస్తాడు. ఎంఎస్ఆర్‌తో ప్లాన్ వెనకు అసలు వ్యక్తి, అతడి బాస్ అయిన శైలేంద్ర ఎంట్రీతో రిషి-వసులకు కొత్త కష్టాలు వస్తాయని తెలుస్తోంది.
శైలేంద్ర భూషణ్ ఎంట్రీ
శైలేంద్ర భూషణ్ ఎంట్రీ

శైలేంద్ర భూషణ్ ఎంట్రీ

Guppedantha Manasu April 26th Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో డీబీఎస్టీ కాలేజ్ మెడికల్ కాలేజ్‌కు పర్మిషన్ రావడంపై రిషి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో సౌజన్యరావు కుట్ర గురించి తనకు చెప్పనందుకు జగతీ, వసుపై కోప్పడతాడు. ఆమెను వదిలేసి ఇంటికొచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చి సుదీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మినిస్టర్ వసు, జగతీ ప్రశంసించడం గురించి ఆలోచిస్తుంటాడు. ఇదే సమయంలో ఇంటికొచ్చిన మహేంద్ర, జగతీ.. రిషిని చూస్తారు. ఇప్పుడు కోపంగా ఉన్నాడని, తర్వాత మాట్లాడదామని మహేంద్ర అనడంతో అక్కడ నుంచి వెళ్లిబోతుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

జగతీకి థ్యాంక్స్ చెప్పిన రిషి..

మహేంద్ర-జగతీ తనను పట్టించుకోకుండా వెళ్లడాన్ని చూసిన రిషి.. మేడమ్ అంటూ జగతీని ఆపుతాడు. వెంటనే ఇద్దరూ ఆగిపోతారు. జగతీకి థ్యాంక్స్ చెప్పడమే కాకుండా తమ కాలేజ్ గురించి, కుటుంబ గౌరవం గురించి ఇంతలా ఆలోచించినందుకు కృతజ్ఞతలు చెబుతాడు. కుమారుడి ప్రవర్తనకు మహేంద్ర, జగతీ పొంగిపోతారు. మన కొడుకు బంగారం కదా.. ఎంత కోపంలో ఉన్నా వెంటనే అర్థం చేసుకుని మాట్లాడతాడు అని మహేంద్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతాడు.

సీన్ కట్ చేస్తే సౌజన్యరావు.. తన బాస్‌కు ఫోన్ చేస్తాడు. డీబీఎస్టీ కాలేజ్‌ను ఎంఎస్ఆర్ కాలేజ్‌లో కలుపుదామనుకున్న మన ప్లాన్ ఫెయిల్ అయిందని వివరిస్తాడు. వెంటనే అతడు సౌజన్యరావుపై కోప్పడతాడు. ఎప్పడో జరిగిన విషయాన్ని కొత్తగా చెబుతున్నావ్, ఇక నన్ను విసిగించకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరోపక్క మహేంద్ర-జగతీ.. వసు ఇంకా రాలేదని ఆందోళన చెందుతుంటారు. రిషి కూడా ఇంటి బాల్కనీ వద్ద నిల్చుని వసుధార ఏమైందనుకుంటూ ఫోన్ చేస్తాడు. కానీ వసు ఫోన్ లిఫ్ట్ చేయదు. జగతీని వసు గురించి ఆరా తీస్తాడు. తాము కూడా వసు గురించే కంగారు పడుతున్నట్లు తెలిపాడు.

మరోపక్క వసు స్కూటీపై ఇంటికి వస్తుంటుంది. రిషి సార్ కంగారు పడతారని అతడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది వసు. కానీ రిషి మిస్డ్ కాల్స్ ఉండేసరికి అవి చూసి ఎంత తిట్టినా రిషి సార్‌కు నామీద ప్రేమ తగ్గదని అనుకుంటుంది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి.. నాకేమి కాలేదు.. ఇంటికే వస్తున్నానని, ఎంఎస్ఆర్ బాస్‌తో జరిగిన గొడవ గురించి వివరిస్తుంది. ఇంటికే వస్తున్నానని చెబుతుంది.

తెగ సంబరపడిపోయిన ధరణి..

సీన్ కట్ చేస్తే దేవయానికి క్యాలెండర్ చూస్తూ..ఈ శూన్యమాసం ఎన్ని రోజులు ఉంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ధరణి వారిద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగగానే.. ధరణి వెళ్లి తీస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శైలేంద్ర భూషణ్ ఎంట్రీ ఇస్తాడు. సౌజన్యరావు బాస్ ఎవరో కాదు దేవయానికి కొడుక శైలేంద్రేనని తెలుస్తుంది. దేవయాని తన కొడుకును చూసి ఫుల్ ఖుషీ అవుతుంది. మహేంద్ర.. అతడిని తన భార్య జగతీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. భర్త వచ్చిన ఆనందంలో ధరణి ఫుల్ ఆనందంతో ఉంటుంది. ఈ రోజు కోసం తను ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెగ సంబరపడిపోతుంది.

దేవయానిపై ఫణీంద్ర సీరియస్..

శైలేంద్ర ఎంట్రీతో ధరణి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. ధరణిని రమ్మని చెబుతాడు. నువ్వు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్ వదినకు తెగ సంతోషపడుతుందని శైలేంద్రకు చెబుతాడు. ఫణీంద్ర కూడా ఈ రోజు ధరణి కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాను. నువ్వు ఇంటికొచ్చి మంచి పని చేశావ్ అంటాడు. ధరణీని కాఫీ తీసుకురమ్మని చెబుతాడు. ఇంతలో దేవయాని ధరణిని ఆగు అంటూ గద్దిస్తూ.. తాను తీసుకొస్తానంటుంది. ఇందుకు ఫణీంద్ర ఒప్పుకోడు. ధరణినే తీసుకొస్తుందని అంటాడు. నా కొడుకు ఇన్నాళ్ల తర్వాత ఇంటికొస్తే నా చేతితో కాఫీ ఇవ్వాలని ఉంటుంది కదా అనగా.. ఫణీంద్ర అందుకుంటూ ధరణి వాడి భార్య.. నీకెంత ప్రేమ ఉంటుందో.. ధరణికి అంతే ప్రేమ ఉంటుందని ఆమెను కాఫీ తీసుకురమ్మంటాడు. మరోపక్క శైలేంద్రకు మాత్రం ధరణి అంటే ఇష్టంలేదని అతడి హావాభావాలు చూస్తే అర్థమవుతుంది.

రిషిపై శైలేంద్ర జెలసీ..

రిషి.. శైలేంద్రను గదిలోకి వెళ్దామని తీసుకెళ్తాడు. గది చూపిస్తూ ఈ రూమ్ నచ్చకపోతే తన రూమ్ ఇస్తానని శైలేంద్రతో అంటాడు. నువ్వు ఇవ్వాల్సినవి చాలానే ఉన్నాయిలే రిషి.. ఒక్కొక్కటిగా తీసుకుంటాను అంటాడు. అన్నయ్య నువ్వు వ్యంగ్యంగా అంటావో, సీరియస్‌గా అంటావో నాకు అర్థం కాదని అంటాడు. అనంతరం శైలేంద్ర.. రిషినీ తన కాలేజ్ ఎండీగా ఎలా ఉందో అడుగుతాడు. ఇందుకు అతడు కాలేజ్‌కు మంచి పేరు తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నానని బదులిస్తాడు. కాలేజ్2కు ఏమో కానీ.. నీకు మాత్రం మంచి పేరు వస్తోంది, నేను ఫారిన్‌లో ఉన్నా కానీ.. నీ గురించి కథలు, కథలుగా విన్నాను అంటూ వెటకారంగా చెబుతాడు. నన్ను మునగ చెట్టు ఎక్కించవద్దని రిషి అంటాడు.

సిగ్గు మొగ్గలెస్తున్న ధరణి..

ఫారిన్ అనుభవం గురించి శైలేంద్రను రిషి అడగ్గా.. నథింగ్ స్పెషల్ అని బదులిస్తాడు. అదిగో నీ స్పెషల్ కాఫీ వస్తుందని ధరణి రావడాన్ని చెబుతాడు. మళ్లీ కలుస్తానని రిషి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ధరణి రాగానే.. ఇది మనిద్దరి గది అవునా.. అని ఆమెను అడుగుతాడు. ఇందుకు ధరణి సిగ్గుపడుతూ అవునని తల ఊపుతుంది. లోపలకు వచ్చేటప్పుడు గది తలుపు వేయాలని నీకు తెలియదా? అని ధరణిని ప్రశ్నిస్తాడు. ఇందుకు ఆమె సిగ్గుపడుతూ తలుపేస్తుంది. అంతటితో బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది. దేవయాని పెంపకంలో శైలేంద్ర మంచి విలన్‍‌గా మారాడని అర్థమవుతుంది. అలాగే భార్య ధరణి అంటే అతడికి ఇష్టం లేదని, అతడి ప్రవర్తన బట్టి చూస్తుంటే ఆమెకు కొత్త కష్టాలు తప్పవని తెలుస్తుంది. అలాగే రిషి అంటే పడదని, అతడిపై జెలసీతో ఉంటాడని కూడా అర్థమవుతుంది. ఇప్పటికే వసుతో గొడవ జరిగింది కాబట్టి ఆమెకు శైలేంద్ర నుంచి కష్టాలు వస్తాయని హింట్ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం