తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Extra Ordinary Man Twitter Review: ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ హిట్ కొట్టాడా?

Extra Ordinary Man Twitter Review: ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ హిట్ కొట్టాడా?

08 December 2023, 6:00 IST

  • Extra Ordinary Man Twitter Review:నితిన్ హీరోగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. కామెడీ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్ మూవీ
ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్ మూవీ

ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్ మూవీ

Extra Ordinary Man Twitter Review: నితిన్ హీరోగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డీన‌రీ మ్యాన్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. భీష్మ త‌ర్వాత నితిన్‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక‌పోవ‌డంతో ఈ సినిమాపైనే అత‌డు భారీగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్‌ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ఎక్స్‌ట్రా ఆర్డీన‌రీ మ్యాన్‌లో నితిన్ జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. ఈ క్యారెక్ట‌ర్‌లో అత‌డి కామెడీ టైమింగ్ బాగుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. చాలా రోజుల త‌ర్వాత ఫుల్ ఫ‌న్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో నితిన్ క‌నిపించిన సినిమా ఇద‌ని, జోవియ‌ల్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. బాహుబ‌లితో పాటు కొన్ని సూప‌ర్ హిట్ సినిమాల‌పై వ‌చ్చే పేర‌డి సీన్స్ తో పాటు నితిన్‌, రావుర‌మేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్‌లోని ఫ‌న్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని అంటున్నారు.

రొటీన్ స్టోరీ లైన్ ఎక్స్‌ట్రా ఆర్డీన‌రీ మ్యాన్‌ సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్‌గా చెబుతున్నారు. ఔట్ డేటెడ్ స్టోరీతో ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి వ‌క్కంతం వంశీ ప్ర‌య‌త్నించాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. చివ‌ర‌లో నితిన్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌ని పేర్కొంటున్నారు.

రాజ‌శేఖ‌ర్ స‌ర్‌ప్రైజ్‌...

ఎక్స్‌ట్రా ఆర్డ‌న‌రీ మ్యాన్‌లో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ రోల్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. రాజ‌శేఖ‌ర్‌ క్యారెక్ట‌ర్ లెంగ్త్ త‌క్కువే అయినా ఆయ‌న క‌నిపించిన సీన్స్ మొత్తం ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. నితిన్‌, శ్రీలీల కెమిస్ట్రీ పాట‌ల్లో చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఎక్స్‌ట్రాతో నితిన్‌కు మ‌రో హిట్ ద‌క్క‌డం ఖాయ‌మ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం