తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dunki Ott: డంకీ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ గురించి చక్కర్లు కొడుతున్న పోస్టర్: వాస్తవం ఏంటంటే!

Dunki OTT: డంకీ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ గురించి చక్కర్లు కొడుతున్న పోస్టర్: వాస్తవం ఏంటంటే!

29 December 2023, 20:23 IST

    • Dunki OTT: డంకీ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోందంటూ.. తేదీతో సహా ఓ పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అందులో స్ట్రీమింగ్ తేదీ కూడా ఉంది. ఈ విషయంలో వాస్తవం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
Dunki OTT: డంకీ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న పోస్టర్
Dunki OTT: డంకీ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న పోస్టర్

Dunki OTT: డంకీ మూవీ ఓటీటీ రిలీజ్‍ డేట్ ఇదే అంటూ చక్కర్లు కొడుతున్న పోస్టర్

Dunki OTT: బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం మోస్తరు కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. డిసెంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ ఎమోషనల్ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ వచ్చింది. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Anuvanuvuu song lyrics: సూపర్ హిట్ మెలోడీ అణువణువూ సాంగ్ లిరిక్స్ ఇవే.. నంబర్ వన్ సింగర్ పాడిన తెలుగు పాట

Indian 2 Update: స్పోర్ట్స్ ఛానెల్‌లో వినూత్నంగా ఇండియన్ 2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేది ఆరోజే!

Malayalam Movies Box office: నాలుగు నెలల్లోనే రూ.1000 కోట్లు.. మలయాళం సినిమా బ్లాక్‌బస్టర్

Chiranjeevi Getup Srinu: గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!

డంకీ మూవీ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. జియో సినిమానే ప్రకటించిందనేలా ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదు. జనవరి 1వ తేదీన డంకీ మూవీ ఓటీటీలోకి రావడం లేదు.

వాస్తవం ఇదే..

డంకీ సినిమా జనవరి 1న స్ట్రీమింగ్‍కు వస్తుందనే పోస్టర్ కావాలనే కొందరు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ వార్ కారణంగా దీన్ని కొందరు వైరల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. జనవరి 1న డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రాదు.

స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చు!

థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో డంకీ సినిమా మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సలార్ విషయంలోనూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా జనవరి 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ మరో పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. అయితే, అది అధికారిక ప్రకటన కాదు. ఆ ఫేక్ పోస్టర్ మాత్రం హల్‍చల్ చేస్తోంది. జనవరి 12న సలార్ ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఫ్యాన్స్ వార్‌లో భాగంగానే కొందరు ఇలా సలార్, డంకీ ఓటీటీ రిలీజ్‍లపై పోస్టర్లను వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది.

డంకీ సినిమా 8 రోజుల్లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.323 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇండియాలోనే రూ.160కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును కూడా దాటేసింది. మరోవైపు, సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్లను దాటగా.. ఇండియాలోనే రూ.300 కోట్ల నెట్ వసూళ్ల మార్కును అధిగమించింది.

డంకీ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిగ్రోవర్, జ్యోతి సుభాష్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమన్ పంత్ సంగీతం అందించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం