తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas: అవన్నీ రూమర్స్...ప్రభాస్ సినిమాపై మారుతి కామెంట్స్...

Prabhas: అవన్నీ రూమర్స్...ప్రభాస్ సినిమాపై మారుతి కామెంట్స్...

HT Telugu Desk HT Telugu

17 June 2022, 7:07 IST

  • దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసింది. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో మారుతి సినిమా గురించి తొలిసారి ప్రభాస్ వెల్లడించారు. ఈ సినిమా కథ, కథనాలతో పాటు హీరోయిన్లకు సంబంధించి చాలా రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నది వెల్లడించాడు. 
ప్రభాస్
ప్రభాస్ (twitter)

ప్రభాస్

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ప్రభాస్ లైనప్ ఫుల్ బిజీగా ఉంది. మరో రెండేళ్ల వరకు అతడి డేట్స్ సర్ధుబాటు కావడం కష్టమే. పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడతడు.ఈ బిజీ షెడ్యూల్స్ లోనే దర్శకుడు మారుతితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో మారుతితో సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ప్రభాస్ మారుతి సినిమాకు సంబంధించి పలు వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.  

హారర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు, ఈ క్యారెక్టర్స్ కోసం మాళవికా మోహనన్, శ్రీలీలతో పాటు మరో నాయికను ఎంపికచేశారని అన్నారు. ఈ ప్రచారంపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో ప్రభాస్ తో సినిమా పై స్పష్టత నిచ్చాడు. ఈ సినిమా కథ, హీరోయిన్ల విషయంలో వినిపిస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తెలిపాడు. హీరోయిన్లు ఎవరిని ఫైనల్ చేయలేదని అన్నాడు. 

పర్సనల్ గా తాను ప్రభాస్ ఫ్యాన్ నని, అతడిని అమితంగా అభిమానిస్తానని మారుతి తెలిపాడు. ఫ్యాన్స్ అందరిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రభాస్ తో పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. డార్లింగ్, బుజ్జిగాడు నాటి ప్రభాస్ ను తన సినిమాలో చూస్తారని, ఆ సినిమాల్లో ప్రభాస్ ఎంత ఉత్సాహంగా కనిపించారో అంతే జోష్, యాక్టివ్ నెస్ ను తన సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాల్ని వెల్లడిస్తానని మారుతి అన్నాడు. 

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కేతో పాటు ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం