తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju New Production House: కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను లాంఛ్ చేసిన దిల్‌రాజు - క‌మెడియ‌న్ వేణు డైరెక్ష‌న్‌లో సినిమా

Dil Raju New Production House: కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను లాంఛ్ చేసిన దిల్‌రాజు - క‌మెడియ‌న్ వేణు డైరెక్ష‌న్‌లో సినిమా

17 December 2022, 7:03 IST

  • Dil Raju New Production House: అగ్ర నిర్మాత దిల్‌రాజు కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను లాంఛ్ చేశారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ప్రారంభించిన ఈ బ్యాన‌ర్ ద్వారా బ‌ల‌గం పేరుతో ఓ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాలో హీరో ఎవ‌రంటే...

దిల్‌రాజు, హ‌న్షిత‌, వేణు టిల్లు
దిల్‌రాజు, హ‌న్షిత‌, వేణు టిల్లు

దిల్‌రాజు, హ‌న్షిత‌, వేణు టిల్లు

Dil Raju New Production House: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు మ‌రో కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను స్టార్ట్ చేశారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఈ బ్యాన‌ర్‌ను మొద‌లుపెట్టిన దిల్‌రాజు ఈ నిర్మాణ సంస్థ‌పై తొలి ప్ర‌య‌త్నంగా బ‌ల‌గం అనే సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో క‌మెడియ‌న్ వేణు టిల్లు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు దిల్‌రాజు తెలిపాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో కూడిన చిన్న సినిమాల్ని నిర్మించాల‌నే ఆలోచ‌న‌తోనే దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ను స్థాపించిన‌ట్లు దిల్‌రాజు పేర్కొన్నాడు.

ద‌ర్శ‌కుడు కావాల‌నే త‌న క‌ల‌ బ‌లగం సినిమాతో తీరింద‌ని వేణు టిల్లు అన్నాడు. కాగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ వ్య‌వ‌హారాల‌ను దిల్‌రాజు కుమార్తె హ‌న్షిత‌తో పాటు హ‌ర్షిత్‌రెడ్డి చేప‌ట్ట‌బోతున్నారు. దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌స్తుతం ప‌లు పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.

రామ్‌చ‌ర‌ణ్ శంక‌ర్ పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు దిల్‌రాజు. అలాగే విజ‌య్ వారిసు సినిమాతో నిర్మాత‌గా త‌మిళంలోకి అరంగేట్రం చేస్తున్నారు. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. తెలుగులో వార‌సుడు పేరుతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాల‌తో పాటు ఏటీఎమ్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు దిల్‌రాజు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం