తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devil Movie Ott Platform: డెవిల్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. టీవీ ఛానెల్ కూడా..

Devil Movie OTT Platform: డెవిల్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. టీవీ ఛానెల్ కూడా..

29 December 2023, 16:02 IST

    • Devil Movie OTT Platform: డెవిల్ సినిమా ఓటీటీ, టీవీ ఛానెల్ భాగస్వాములు ఖరారయ్యారు. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Devil Movie OTT Platform: డెవిల్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్
Devil Movie OTT Platform: డెవిల్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

Devil Movie OTT Platform: డెవిల్ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

Devil Movie OTT Platform: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (డిసెంబర్ 29) థియేటర్లలోకి వచ్చింది. పీరియాడికల్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్‍గా ఈ చిత్రంలో నటించారు. డెవిల్ సినిమాకు పాజిటివ్ టాకే వస్తోంది. ముఖ్యంగా కల్యాణ్ రామ్ యాక్టింగ్‍కు మంచి మార్కులు పడుతున్నాయి. కాగా, డెవిల్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్, శాటిలైట్ హక్కుల సమాచారం బయటికి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Tabu in Dune series: ఆ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర చేయబోతున్న బాలీవుడ్ నటి

Guppedantha Manasu May 14th Episode: గుప్పెడంత మనసు- తన ఉచ్చులో తానే పడిన శైలేంద్ర- పిచ్చోడిన చేసిన మహేంద్ర, వసుధార

GV Prakash Kumar: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. మానసిక ప్రశాంతత కోసమే అంటూ..

Krishna mukunda murari serial: కృష్ణని గొడ్రాలన్న మీరా.. ముకుందకు ప్రపోజ్ చేసేందుకు ఫిక్స్ అయిన ఆదర్శ్

డెవిల్ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. భారీ ధరకే ఈ మూవీని ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డెవిల్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. 2024 ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

శాటిలైట్ హక్కులు ఇలా..

డెవిల్ సినిమా మేకర్స్.. శాటిలైట్ హక్కుల డీల్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం శాలిలైట్ రైట్స్‌ను ఈటీవీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ ఛానెల్‍లో ఈ చిత్రం ప్రసారం కానుంది.

డెవిల్ చిత్రంలో మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సోనెబ్లిక్, ఎల్నాజ్ నోరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సీతా సత్య కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించారు. దర్శకుడిగానూ ఆయనే వ్యవహరించారు. అయితే, ఈ చిత్రానికి ఎక్కువ భాగం తానే డైరెక్షన్ చేశానని నవీన్ మేడారం ఇటీవలే వెల్లడించారు. ఇది కాస్త వివాదమైంది.

డెవిల్ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ వ్యవహరించారు. డెవిల్ చిత్రంలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‍గా హీరో కల్యాణ్ రామ్ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సులుగా కూడా బాగున్నాయనే టాక్ వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్టులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నరేషన్ మరింత మెరుగ్గా ఉండాల్సిందని వినిపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం