తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Third Song: చమ్కీల అంగీలేసి.. దసరా మూడో పాట విడుదల

Dasara Third Song: చమ్కీల అంగీలేసి.. దసరా మూడో పాట విడుదల

HT Telugu Desk HT Telugu

08 March 2023, 17:01 IST

    • నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా మూవీలో మూడో పాట ‘చమ్కీల అంగీలేసి’ విడుదలైంది.
దసరా మూవీ మూడో పాట ‘చమ్కీల అంగీలేసి’ విడుదల
దసరా మూవీ మూడో పాట ‘చమ్కీల అంగీలేసి’ విడుదల

దసరా మూవీ మూడో పాట ‘చమ్కీల అంగీలేసి’ విడుదల

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ అత్యంత ఆసక్తి రేపిన చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటలకు అన్ని భాషలలో అద్భుతమైన స్పందన వచ్చింది. సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్‌‌లతో కూడిన ఆల్బమ్‌‌ను స్కోర్ చేశారు. దసరా మూవీలోని మూడో సింగిల్ చమ్కీల అంగీలేసి పాట ఇప్పుడు విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

చమ్కీల అంగీలేసి పాట ప్రతి పెళ్లిళ్ల సీజన్‌ కి సెట్ అయ్యే ఫోక్ మెలోడీ. సంతోష్ నారాయణన్ డీప్ రూటేడ్ సాంగ్ స్కోర్ చేశారు. పెళ్లిలో భార్యాభర్తలు పరస్పరం వాదులాడుకునే సొగసైన పాటిది. భార్య పాత్ర పోషించిన కీర్తి సురేష్.. తన భర్త ఎలా దుస్తులు ధరించేవాడో, పెళ్లయిన తొలినాళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో, తర్వాత ఎంత నిర్లక్ష్యంగా మారిపోయాడో చెబుతుంది. నాని కూడా తన భార్యపై అలాంటి వాదనలే చేశాడు. ఇది ప్రతి భార్య భర్త రిలేట్ చేసుకునే పాట.

చమ్కీలా అంగీలేసి పాటలో నాని దసరా బుల్లోడులా కనిపించగా, కీర్తి సురేష్ చీరలో అందంగా కనిపించింది. భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఉండే అభిప్రాయాలను కాసర్ల శ్యామ్ తన సాహిత్యంతో అందంగా ఆవిష్కరించారు. రామ్ మిరియాల, ధీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని అద్భుతంగా పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ మరో ప్లస్. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌ లో అన్ని పెళ్లిళ్లలో ఈ పాట ప్లే అవుతుందన్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తంచేసింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. ‘దసరా’ మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం