తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Ramcharan Meets Amit Shah: చ‌ర‌ణ్‌కు అమిత్‌షా స‌త్కారం - ఫొటోలు వైర‌ల్‌

Chiranjeevi Ramcharan Meets Amit Shah: చ‌ర‌ణ్‌కు అమిత్‌షా స‌త్కారం - ఫొటోలు వైర‌ల్‌

18 March 2023, 7:35 IST

  • Chiranjeevi Ramcharan Meets Amit Shah: మెగా హీరోలు చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను శుక్ర‌వారం క‌లుసుకున్నారు. అమిత్‌షాను చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్
అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్

Chiranjeevi Ramcharan Meets Amit Shah: భార‌తీయ చిత్ర‌సీమ‌లోని ఇద్ద‌రు దిగ్గ‌జాలు అయిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నాడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. శుక్ర‌వారం అమిత్‌షాను ఆయ‌న ఇంటిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్‌చ‌ర‌ణ్‌ క‌లిశారు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశ సంస్కృతి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేస్తున్న‌ద‌ని అమిత్‌షా కొనియాడారు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డంతో పాటు ఆర్ఆర్ ర్ సినిమా అద్భుత విజ‌యం సాధించినందుకు రామ్‌చ‌ర‌ణ్‌కు అమిత్‌షా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఇద్ద‌రు దిగ్గ‌జాలు అయిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని అమిత్‌షా ట్వీట్ చేశారు. చ‌ర‌ణ్‌ను శాలువాతో స‌త్క‌రించారు. అమిత్‌షాను చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. అమిత్‌షా ఆత్మీయ స‌త్కారంపై చిరు ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తాను భాగం కావ‌డం థ్రిల్లింగ్‌గా అనిపించింద‌ని చిరంజీవి ట్వీట్ చేశాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ గెలిచిన తొలి తెలుగు సినిమాగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం