తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Businessman Re Release Collection: రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ - దుమ్మురేపిన మ‌హేష్ బిజినెస్‌మేన్‌

Businessman Re Release Collection: రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ - దుమ్మురేపిన మ‌హేష్ బిజినెస్‌మేన్‌

HT Telugu Desk HT Telugu

10 August 2023, 13:02 IST

  • Businessman Re Release Collection: టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో మ‌హేష్‌బాబు బిజినెస్‌మేన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోల సినిమాల క‌లెక్ష‌న్స్‌ను అధిగ‌మిస్తూ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

మ‌హేష్‌బాబు బిజినెస్‌మేన్
మ‌హేష్‌బాబు బిజినెస్‌మేన్

మ‌హేష్‌బాబు బిజినెస్‌మేన్

Businessman Re Release Collection: రీ రిలీజ్ సినిమాల్లో మ‌హేష్‌బాబు (Mahesh Babu) బిజినెస్‌మేన్‌ గ‌త రికార్డుల‌ను బ‌ద్ధ‌లుకొట్టింది. తొలిరోజు హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన రీ రిలీజ్ మూవీగా నిలిచింది. మ‌హేష్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధ‌వారం బిజినెస్‌మేన్ మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా అభిమానుల ముందుకొచ్చింది. 4కే డాల్బీ అట్మాస్ టెక్నాల‌జీతో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీపై ఉన్న క్రేజ్ కార‌ణంగా అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లోకోటికిపైగా జ‌రిగాయి.

ట్రెండింగ్ వార్తలు

NNS 21st May Episode: ​​​​సరస్వతిని చంపాలని చూసిన మనోహరి.. భాగీ మోసం చేసిందని కోపంతో వెళ్లిపోయిన అమర్

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

బుధ‌వారం రోజు పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో మ‌హేష్ బాబు మూవీకి భారీ సంఖ్య‌లో థియేట‌ర్లో దొరికాయి. దాంతో బిజినెన్‌మేన్‌ తొలిరోజు నాలుగు కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే బిజినెస్‌మేన్‌ మూవీ బుధ‌వారం రోజు రెండున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

సీడెడ్‌లో 40 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర 42 ల‌క్ష‌లు, గుంటూరు 35, కృష్ణ ఏరియాలో 30 ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు బిజినెస్‌మేన్ మూవీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నైజాం ఏరియాలో రీ రిలీజ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ కోటి అర‌వై ఐదు ల‌క్ష‌ల‌తో ఖుషి ఇన్నాళ్లు టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ సినిమా రికార్డ్‌ను బిజినెస్‌మేన్ బ్రేక్ చేసింది.

కొత్త రికార్డ్‌ను సృష్టించింది. బిజినెస్‌మేన్ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. 2012లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది హ‌య్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 90 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సూర్య‌భాయ్ అనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా మ‌హేష్‌బాబు యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం