తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar: సలార్‌లో లేనిది మా బబుల్‌గమ్‌ మూవీలో ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Salaar: సలార్‌లో లేనిది మా బబుల్‌గమ్‌ మూవీలో ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

24 December 2023, 8:57 IST

  • Bubble Gum Director About Salaar: సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సలార్ మూవీలో లేనిది బబుల్‌గమ్ సినిమాలో ఉందని డైరెక్టర్ రవికాంత్ పేరేపు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సలార్‌లో లేనిది మా బబుల్‌గమ్‌ మూవీలో ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
సలార్‌లో లేనిది మా బబుల్‌గమ్‌ మూవీలో ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

సలార్‌లో లేనిది మా బబుల్‌గమ్‌ మూవీలో ఉంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Ravikanth Perepu About Salaar: యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకలా హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'బబుల్‌గమ్'. ఇందులో హీరోయిన్‌గా మానస చౌదరి చేస్తోంది. ఇప్పటికే బబుల్‌గమ్ ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

బబుల్‌గమ్ జర్నీ

"క్షణం తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ, కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. దాంతో యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్లతో చేయడానికి 'బబుల్‌గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్‌ను కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత మా జర్నీ మొదలైయింది. జూలైలో షూటింగ్ మొదలుపెట్టి సినిమాని చాలా ఫాస్ట్ గా చేశాం. 'బబుల్‌గమ్' అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్" అని రవికాంత్ అన్నాడు.

కొత్తవాళ్లే ఎందుకు ?

ఇది కొత్తవాళ్లతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటెక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్‌ని వెతుక్కుంటూ బయటికి వెళ్లినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి కెరీర్‌ని ఎంచుకోవాలి ? డబ్బులు ఉంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా? ఇలా చాలా కన్ఫ్యుజన్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం. ఇలాంటి కథకు కొత్తవాళ్లు అయితేనే బెటర్ అనిపించింది" అని డైరెక్టర్ తెలిపారు.

సలార్ సమయంలో ఇది పర్ఫెక్ట్ రిలీజా?

"సలార్లో లేనిది మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేనిది సలార్‌లో ఉంది (నవ్వుతూ). మా టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా బజ్ వచ్చింది. అలాగే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ బజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని భావించాం. ఈ బజ్ తగ్గట్టే సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్‌గా ఉంటాయి. ప్రేక్షకులని బలంగా హత్తుకుంటాయి" అని డైరెక్టర్ రవికాంత్ పేరేపు చెప్పుకొచ్చాడు.

సలార్ మూవీపై బబుల్‌గమ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు కామెంట్స్
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం