తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boyapati On Balakrishna: క‌థ విన‌కుండానే బాల‌కృష్ణ సినిమాలు చేస్తాడు - బోయ‌పాటి శ్రీను కామెంట్స్ వైర‌ల్‌

Boyapati on Balakrishna: క‌థ విన‌కుండానే బాల‌కృష్ణ సినిమాలు చేస్తాడు - బోయ‌పాటి శ్రీను కామెంట్స్ వైర‌ల్‌

06 October 2023, 11:14 IST

  • Boyapati on Balakrishna: బాల‌కృష్ణ‌కు ఇప్ప‌టివ‌ర‌కు క‌థ చెప్పే అవ‌స‌రం త‌న‌కు రాలేద‌ని డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను పేర్కొన్నాడు. తాను డైరెక్ట‌ర్ అంటే బాల‌కృష్ణ క‌థ విన‌కుండానే సినిమా చేస్తాడ‌ని పేర్కొన్నాడు.

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను
బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను

Boyapati on Balakrishna: టాలీవుడ్‌లో హీరో బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుల‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌గా చెబుతోంటారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. బాల‌కృష్ణ‌లోని మాస్ యాంగిల్‌, హీరోయిజాన్ని త‌న సినిమాల్లో ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రిస్తుంటారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. వీరిద్ద‌రి కాంబోలో అఖండ 2 రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Balakrishna: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌తో త‌న‌కున్న బాండింగ్ గురించి బోయ‌పాటి శ్రీను ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. బాల‌కృష్ణ‌తో మూడు సినిమాలు చేసినా ఒక్క‌సారి కూడా ఆయ‌న‌కు క‌థ చెప్పే అవ‌స‌రం రాలేద‌ని అన్నాడు. తాను డైరెక్ట‌ర్ అంటే క‌థ కూడా అడ‌గ‌కుండా బాల‌కృష్ణ సినిమా చేస్తాడ‌ని బోయ‌పాటి శ్రీను తెలిపాడు. ఒక‌వేళ క‌థ చెబుతునాన్న వ‌ద్దు బ్ర‌ద‌ర్ మీరు ఉన్నారు క‌దా అని బాల‌కృష్ణ అంటుంటాడ‌ని బోయ‌పాటి శ్రీను పేర్కొన్నాడు.

బాల‌కృష్ణ‌తో త‌న‌కున్న‌ బాండింగ్ అలాంటిద‌ని, ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూనే వ‌స్తున్నాన‌ని చెప్పాడు. షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే బాల‌కృష్ణ‌కు సినిమాను చూపిస్తుంటాన‌ని బోయ‌పాటి శ్రీను చెప్పాడు. బాల‌కృష్ణ‌తో త‌ప్ప‌కుండా అఖండ 2 సినిమా ఉంటుంద‌ని బోయపాటి శ్రీను అన్నాడు

బాల‌కృష్ణ‌, బాబీ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే అఖండ 2 సెట్స్‌ఫైకి వ‌స్తుంద‌ని బోయ‌పాటి శ్రీను చెప్పాడు బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి బోయ‌పాటి శ్రీను చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. స్కంద త‌ర్వాత మ‌రో స్టార్ హీరోగా తాను సినిమా చేయ‌బోతున్న‌ట్లు బోయ‌పాటి శ్రీను తెలిపాడు. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది తొంద‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం