తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu : బిగ్‌ బాస్ వేస్ట్ ప్రోగ్రాం.. భైరి నరేశ్ సెన్సేషనల్ కామెంట్స్

Bigg Boss 7 Telugu : బిగ్‌ బాస్ వేస్ట్ ప్రోగ్రాం.. భైరి నరేశ్ సెన్సేషనల్ కామెంట్స్

Anand Sai HT Telugu

03 September 2023, 22:59 IST

    • Bigg Boss 7 Telugu : బిగ్‍బాస్ 7 సీజన్ మెుదలైంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్‍బాస్ మీద భైరి నరేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి?
బిగ్ బాస్‍పై భైరి నరేశ్ కామెంట్స్
బిగ్ బాస్‍పై భైరి నరేశ్ కామెంట్స్

బిగ్ బాస్‍పై భైరి నరేశ్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో భైరి నరేశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన అయ్యప్ప దేవుడి మీద చేసిన కామెంట్స్ కారణంగా.. సోషల్ మీడియాలోనూ, బయట కూడా బాగా ఫేమస్ అయ్యారు. తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. సామాజిక కార్యకర్తగా, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంతో సమాజంలోని మూఢ విశ్వాసలను రూపు మాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. తనకంటూ సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్‍బాస్ షోపై భైరి నరేశ్ కామెంట్స్ చేశారు. మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నారట కదా.. అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి భైరి నరేశ్‍కు ప్రశ్న వేశాడు. అయితే బిగ్ బాస్ షో అనేది వేస్ట్ ప్రోగ్రాం అంటూ భైరీ నరేశ్ వ్యాఖ్యానించారు. ఏ పని లేకుండా ఖాళీగా ఉండేవారికి.. టీవీల ముందు కూర్చొని పక్క వాళ్ల ఇంట్లోకి తొంగి చూసే స్వభావం ఉన్నవారికి లేదా బరి తెగించిన రొమాన్స్ ను కళ్లారా చూసి ఆనందించేవారికి బిగ్ బాస్ షో బాగుంటుందని చెప్పుకొచ్చారు.

'బిగ్ బాస్ షో గంటలు గంటలు చూస్తున్నారు అంటే.. వారికి అంత సమయం ఉంది. ఈ అమ్మాయి బాగా నటిస్తుందా.. ఆ అమ్మాయి బాగా నటిస్తుందా? కిస్ పెట్టుకున్నారా? హగ్ చేసుకున్నారా? అని చూస్తున్నారు.' అని చెప్పుకొచ్చారు భైరి నరేశ్.

బిగ్ బాస్ షోలోకి వెళ్లి డబ్బు తెచ్చుకోవాలని తనకు లేదని చెప్పుకొచ్చారు భైరి నరేశ్. బిగ్ బాస్ షోకి తాను వెళ్లడం వలన లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ షోలోకి వెళ్లడం వెళ్లకపోవడం అనేది ఊహాజనిత ప్రశ్ని అని వివరించారు. అయితే తనకు బిగ్ బాస్ షో నుంచి ఆహ్వానం రాలేదని, తనకు ఆ ఆశ లేదని, ఒకవేళ వచ్చినా పెద్దగా పట్టించుకోనని వెల్లడించారు.

బిగ్ బాస్ షోలోకి వెళ్లడం ద్వారా ఎక్కువ మందికి పరిచయం కావాలనే ఆశ, దురాశ లేదని తెలిపారు భైరి నరేశ్. తనకు వచ్చిన పబ్లిసిటీ చాలని, అలా అని ఆసక్తి లేదని, అనాసక్తి లేదని వెల్లడించారు.

ఈ సందర్భంగా తనకు ఇష్టమైన హీరో గురించి కూడా చెప్పుకొచ్చారు భైరి నరేశ్. ఒకప్పుడు తనకు నాగర్జున అంటే ఇష్టమని, ఆయనకు సంబంధించిన పేపర్ కట్టింగ్స్ ను బుక్స్ లో దాచుకున్నట్టుగా గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ అంటే ఇష్టమని తెలిపారు. ఆయనకు కులమతాల పట్టింపులేదని, మంచి నటుడు అని వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం అయ్యప్ప స్వామి మీద కామెంట్స్ చేసి.. ఫేమస్ అయ్యారు భైరి నరేశ్. ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. తర్వాత.. దానికి క్షమాపణలు కూడా చెప్పారు. భారత నాస్తిక సమాజం నుంచి బయటకు వచ్చారు. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించారు. ప్రజలను చైతన్యవంత చేయడమే తన లక్ష్యమని అంటున్నారు భైరి నరేశ్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం