తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‍లో సిగరెట్ తాగిన లేడీ కంటెస్టెంట్.. ఓహో దమ్ము కొట్టొచ్చా?

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‍లో సిగరెట్ తాగిన లేడీ కంటెస్టెంట్.. ఓహో దమ్ము కొట్టొచ్చా?

Anand Sai HT Telugu

11 September 2023, 6:49 IST

    • Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్స్ కావడంతో కాస్త పక్కగా ప్లాన్ చేశారు. అయితే ఈ సందర్భంగా కంటెస్టెంట్ సిగరెట్ తాగుతూ కనిపించింది.
బిగ్ బాస్ 7 తెలుగు
బిగ్ బాస్ 7 తెలుగు

బిగ్ బాస్ 7 తెలుగు

బిగ్ బాస్ సీజన్ 7లో మెుదటి ఎలిమినేషన్ జరిగింది. మెుత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‍లో ఉండగా.. వారిని వడపోసి.. వడపోసి.. ఒక్కరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. మెుదట ఎనిమిది మంది ఉండగా.. అందులో రతిక, శోభా శెట్టి సేఫ్ అయ్యారు. కాసేపటికి.. మరో గేమ్ పెట్టాడు బిగ్ బాస్. అందులో నలుగురిని సేఫ్ చేశాడు. చివరకు ఇద్దిరిని ఫిక్స్ చేశాడు. ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ చివరి దాకా వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరిలో కిరణ్‍ను ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్

ట్రెండింగ్ వార్తలు

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

కిరణ్, షకిలాకు మంచి బాండింగ్ ఏర్పడింది. కిరణ్ వెళ్లిపోతుంటే.. షకిలా తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చింది. హౌస్‍లోని సభ్యులు కూడా బాధపడ్డారు. అంతకుముందు ఆడిన గేమ్‍లో తనకు షకిలా బాగా దగ్గరైందని కిరణ్ చెప్పుకొచ్చింది. షకిలా కూడా కిరణ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని వివరించింది. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ అయిందని అర్థమైంది. షకిలా పేరును చాలా మందే పాజిటివ్‍గా చెప్పారు. ఎవరికైనా ఏదైనా కావాల్సి వస్తే.. షకిలా ముందుగా ఉంటుందని వివరించారు.

మెుత్తానికి కిరణ్ వెళ్లిపోతుంటే.. కన్నీళ్లు పెట్టుకుంది షకిలా. అయితే ఈ సందర్భంగా ఓ దృశ్యం కనిపించింది. అదేంటంటే.. కాస్త షకిలా ఒత్తిడికి గురైనట్టుగా ఉంది. సిగరెట్ తాగుతూ కనిపించింది. ఆమె దగ్గరకు దామిని వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేసింది. అసలు ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేశారు అన్నట్టుగా బాధపడింది షకిలా. అయితే ఆమె సిగరెట్ తాగే దృశ్యం మాత్రం.. కాస్త అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్‍ హౌస్‍లో ఇలాంటివి అనుమతి ఇవ్వరు కదా అని మాట్లాడుకుంటున్నారు. ఓహో కావాల్సినవి ఇస్తారా అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని చూపించడం ఎందుకని మరికొందరు అంటున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్‍లో సిగరెట్ తాగడం అనేది కొత్త ఏం కాదు. సీజన్ 5లో కూడా ఇలాంటివి చూపించాడు బిగ్ బాస్. ఆ సీజన్లో హమీద, సరయు, లోబో స్కోకింగ్ జోన్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ.. దమ్ము కొట్టడం కనిపించింది. గుప్పు గుప్పుమంటూ పొగలు వదిలారు. తర్వాత సిగరెట్లను భద్రంగా దాచుకున్నారు. అప్పుడు కూడా ఈ విషయాన్ని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. తర్వాత నాగర్జున కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మరి ఇప్పుడు షకిలా సిగరెట్ తాగడం చూసి.. నాగర్జున ఏదైనా అడుగుతాడో లేదో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం