తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Rathika : రతిక హార్ట్ బ్రేక్ చేసిన నాగ్.. బాధపడుతున్న హీరోయిన్

Bigg Boss 7 Rathika : రతిక హార్ట్ బ్రేక్ చేసిన నాగ్.. బాధపడుతున్న హీరోయిన్

Anand Sai HT Telugu

03 September 2023, 22:17 IST

    • Bigg Boss 7 Rathika : కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది రతిక. సోషల్ మీడియాలోనూ ఫేమస్ అయింది. కానీ తాను కోరుకున్న పాపులారిటీ రాలేదని బిగ్‍బాస్ హౌజులోకి ఎంట్రి ఇచ్చింది.
రతిక
రతిక

రతిక

ఇప్పటికే హీరోయిన్‍గా, సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయన్సర్‍గా గుర్తింపు తెచ్చుకుంది రతిక. అయితే ఇప్పుడు బిగ్‍బాస్ హౌజులోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ మరింత పాపులారిటీని సంపాదించాలని పట్టులదలతో ఉంది. ఇప్పటికే ఆమె పలు సినిమాలు చేసింది. కానీ సరైన గుర్తింపు రాలేదని హర్ట్ అవుతుంది ఈ అమ్మడు. అందుకే బిగ్‍బాస్ హౌజులోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

ఈ సందర్భంగా రతికను ఓపెన్ చేసేందుకు నాగ్ పలు ప్రశ్నలు వేశాడు. రతిక హార్ట్ ఎలా ఉందని ప్రశ్నించాడు. దీంతో ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారని, చేసిందంతా చేశారని ఫన్నీ రిప్లై ఇచ్చింది రతిక. ఏం జరిగిందో తెలియాలంటే.. బిగ్‍బాస్ చూడాలని చెప్పుకొచ్చింది.

నిజానికి రతిక రోస్ అచ్చ తెలుగు అమ్మాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మెుదట మెడలింగ్ చేసింది. ఆ తర్వాత.. మెల్లమెల్లగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. సినిమాల్లో అవకాశాల కోసం బాగా కష్టపడింది. బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది మూవీలో నటించింది. నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‍గా మెప్పించింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా.. గుర్తింపు రావడం లేదని బాధపడుతోంది.

తనకంటూ క్రేజ్ సంపాదించాలని ఎప్పటినుంచో ప్రణాళికతో ఉంది రతిక. ఇప్పుడు బిగ్‍బాస్ హౌజులోకి అడుగుపెట్టి.. అందరినీ సర్‍ప్రైజ్ చేసింది. చమ్కీల అంగీలేసి పాటకు క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేసింది. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు హార్ట్ బ్రేక్ అయిందని, నాగ్ ఓ హార్ట్ తెప్పించి ఇచ్చాడు. ఈమె.. బిగ్‍బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించాలని చూస్తోంది. ఈ అమ్మాయి బిగ్ కాంపిటీషన్‍లో ఎంత వరకూ ఉంటుందో చూడాలి. ఎన్ని వీక్స్ పోటీ ఇస్తుందో తెలుసుకోవాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం